సాయం చేయబోయి చిక్కుల్లో పడ్డ ఒక 25 ఏళ్ల యువకుడి కథ ఇప్పుడు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
మెట్లపై నుండి అదుపు తప్పి పడిపోతున్న ఒక మహిళను, అక్కడ ఉన్న ఒక యువకుడు సరైన సమయంలో పట్టుకుని కాపాడాడు. ఆ యువకుడు గనుక అక్కడ లేకపోయి ఉంటే, ఆ మహిళకు ప్రాణాపాయం సంభవించి ఉండేదని అక్కడ ఉన్న సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అయితే, తన ప్రాణాలు కాపాడిన ఆ యువకుడికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి, ఆ మహిళ ఏకంగా అతనిపై కోర్టులో కేసు వేసింది.
తన్ను పట్టుకున్న సమయంలో తనకు గాయాలయ్యాయని పేర్కొంటూ, సుమారు 2.50 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2 కోట్లు) నష్టపరిహారం కావాలని ఆమె కోర్టును ఆశ్రయించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. “డబ్బు కోసం మనుషులు ఇంతలా దిగజారుతారా?” అని నెటిజన్లు ఆ మహిళపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే, ఇకపై ఎవరైనా ఇతరులకు సాయం చేయడానికి ముందుకు వస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మానవత్వం కంటే డబ్బే ముఖ్యం అనుకునే కొందరి స్వభావం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
