కాలేయానికి ఏదైనా నష్టం వాటిల్లితే, అది దాని పనితీరును నెమ్మదిగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. వ్యాధి ముదిరినప్పుడు కాలేయం కుంచించుకుపోయి, రాయిలా గట్టిగా మారుతుంది. ఈ పరిస్థితినే ‘సిరోసిస్’ అని పిలుస్తారు.
లివర్ సిరోసిస్ కాలేయానికి వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇది కాలేయంలోని ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేసి, దాని పనితీరును దెబ్బతీస్తుంది.
సిరోసిస్‌కు కారణాలు: లివర్ సిరోసిస్‌లో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. చివరి దశకు చేరుకున్న వారికి కాలేయం పూర్తిగా పనిచేయకపోవడం లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స (Liver Transplant) అవసరం కావచ్చు.
- మద్యపానం: నిరంతరం మద్యం సేవించడం సిరోసిస్‌కు ప్రధాన కారణం.
- వైరల్ ఇన్ఫెక్షన్లు: హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి ఇన్ఫెక్షన్లు కాలేయ వాపుకు దారితీసి సిరోసిస్‌గా మారవచ్చు.
- నాన్-ఆల్కహాలిక్ కారణాలు: మద్యం సేవించని వారిలో మధుమేహం (Diabetes), అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం (Fatty Liver) కూడా కారణమవుతాయి.
- ఇతర కారణాలు: వంశపారంపర్య వ్యాధులు, కాలేయంలో ఇనుము లేదా రాగి అధికంగా పేరుకుపోవడం, పిత్త వాహికలో అడ్డంకులు, కొన్ని రకాల మందుల వాడకం మరియు గుండె వైఫల్యం.
గుర్తించాల్సిన లక్షణాలు: వ్యాధి ముదిరినప్పుడే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
- చర్మంపై దురద
- కామెర్లు (Jaundice)
- కాళ్లు మరియు కడుపులో వాపు (నీరు చేరడం)
- కడుపు నొప్పి, తీవ్రమైన అలసట
- ఆకలి మందగించడం, బరువు తగ్గడం
- వికారం మరియు వాంతులు
చికిత్స మరియు నివారణ: లివర్ సిరోసిస్ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ వ్యాధి ముదరకుండా అడ్డుకోవచ్చు.
- మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
- హెపటైటిస్ బి, సి వ్యాక్సిన్లు తీసుకోవాలి.
- అధిక బరువును తగ్గించుకోవడం, మధుమేహం మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి.
- వ్యాధి తీవ్రమైన వారికి కాలేయ మార్పిడి ఒక్కటే మార్గం.
వ్యాధి ప్రారంభంలో లక్షణాలు ఉండకపోవచ్చు, కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏదైనా లక్షణం కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
