ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్త, తన భార్యను ఆమె ప్రియుడితోనే కలిపి పంపించిన అరుదైన ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర ఆశ్చర్యాన్ని, చర్చను రేకెత్తించింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ విక్కీకి, సోనాలి అనే యువతికి గత ఏడాది సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది.
పెళ్లయి కొన్ని నెలలు మాత్రమే గడిచిన క్రమంలో, కొద్ది రోజుల క్రితం భార్య సోనాలి అకస్మాత్తుగా ఇంట్లో నుంచి అదృశ్యమైంది. దీనిపై సమాచారం అందుకున్న భర్త విక్కీ, స్థానిక పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా.. సోనాలి తన చిరకాల ప్రియుడి వద్ద ఉన్నట్లు గుర్తించి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు విచారణ జరపగా, సోనాలి తన ప్రియుడితో ఉన్న ప్రేమ వివాహం తర్వాత కూడా కొనసాగిందని, వారిద్దరూ కలిసే జీవించాలనుకుంటున్నారని వెల్లడైంది. ఈ నిజాన్ని తెలుసుకున్న భర్త విక్కీ, తన భార్య ఇష్టానికి అడ్డుగోడలా నిలబడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
ఆమె మనసును బలవంతంగా మార్చే ప్రయత్నం చేయకుండా, భార్య కోరిక ప్రకారమే ఆమెను ప్రియుడితో కలిపి పంపించే వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. భార్య ప్రేమను గౌరవిస్తూ, ఆమె జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతో ప్రియుడి వద్దకే సాగనంపిన ఆ కానిస్టేబుల్ తీసుకున్న నిర్ణయం స్థానిక ప్రజల్లోనే కాకుండా పోలీస్ శాఖ వర్గాల్లోనూ తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది.
సినిమా కథలను తలపించేలా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుండగా, భార్యను ప్రియుడితో పంపించిన కానిస్టేబుల్ విక్కీ పెద్ద మనసును చూసి నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
