“ప్రేమగా చెప్పడం మానేసి దాడులు చేస్తారా?!” కుమార్తెను చెప్పుతో కొట్టిన తండ్రి… తిరగబడి తన్నిన కూతురు! ఒక్కసారిగా చెలరేగిన ఘర్షణతో సోషల్ మీడియాలో మొదలైన చర్చ!

కుమార్తె రోజూ ఇంటికి చాలా ఆలస్యంగా రావడం అలవాటుగా మార్చుకోగా, తండ్రి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె వినలేదని తెలుస్తోంది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి, కుమార్తె మళ్లీ ఆలస్యంగా రావడంతో కోపంతో ఆమెను చెప్పుతో వరుసపెట్టి బాదాడు. తండ్రి చేసిన ఈ అకస్మాత్తు దాడితో తీవ్ర కోపానికి గురైన కూతురు కూడా తగ్గకుండా ఎదురు తిరిగి తండ్రిని బలంగా తన్ని కిందకు తోసేసింది.

వీరిద్దరూ నడిరోడ్డుపై ఒకరినొకరు కొట్టుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కుటుంబ సమస్యలను మాట్లాడి పరిష్కరించుకోకుండా హింసకు పాల్పడిన తండ్రి చర్యను, అలాగే తిరిగి తండ్రిపైనే దాడికి దిగిన కూతురి ప్రవర్తనను పలువురు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *