ఉన్నావ్ అత్యాచార కేసులో తాజాగా కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు విచారణలో ఉంది. అయితే, ఈ కేసులో ఒక ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
ఆ ఆడియోలో అమ్మాయి మరియు ఆమె బంధువు (చిన్నాన్న అని చెబుతున్నారు) మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది:
ఆడియోలోని సంభాషణ :
అమ్మాయి: హలో.
చిన్నాన్న: హా.
అమ్మాయి: వాళ్లు డాక్టర్ పరీక్ష చేయించుకోమంటున్నారు, ఆ తర్వాతే రిపోర్ట్ తీసుకోమంటున్నారు.
చిన్నాన్న: ఎందుకు? ఇంకా రిపోర్ట్ రాయలేదా?
అమ్మాయి: లేదు, ఇంకా రాయలేదు, సమయం పడుతోంది.
చిన్నాన్న: ఎందుకు ఆలస్యం? కంప్యూటర్లో టైప్ చేస్తున్నారని చెప్పావుగా? అమ్మాయి: అవును, కంప్యూటర్లో టైప్ చేస్తున్నారు, అందుకే టైమ్ పడుతోంది. చిన్నాన్న: సరే, ముందు ఎఫ్ఐఆర్ (FIR) చేయించుకో. నేను కారు పంపిస్తున్నాను. అప్పటివరకు వాళ్లను ఎఫ్ఐఆర్ రాయమని చెప్పు.
అమ్మాయి: ఇక్కడ కూడా బండి (టెంపో) వచ్చింది.
చిన్నాన్న: టెంపోలో వెళ్లొద్దు. మన సొంత కారు వస్తోంది. టెంపో దిగిపోండి. అమ్మాయి: సరే.
చిన్నాన్న: హలో.. నీ పక్కన ఎవరున్నారు?
అమ్మాయి: నా పక్కన అమ్మ మాత్రమే ఉంది.
చిన్నాన్న: సరే.. విను, మీ ‘అంతర్గత అవయవాల’పై (Private Parts), అది నీవైనా లేదా నీతో ఉన్న మిగతా అమ్మాయిలవైనా సరే.. ఏదో రకంగా గోళ్లతో గీతలు (Scratches) పెట్టుకోండి.
అమ్మాయి: సరే, సరే.
చిన్నాన్న: అర్థమైందా? అక్కడికి వెళ్ళాక చిన్నపిల్లలందరూ అదే చెప్పాలి.. ఇక్కడ చెయ్యి వేశారు, అక్కడ చెయ్యి వేశారు అని.
అమ్మాయి: హా, హా.
చిన్నాన్న: ఇదే స్టేట్మెంట్ అందరూ ఇవ్వాలి.
అమ్మాయి: సరే.. మీ కారు ఎప్పుడు వస్తుంది?
చిన్నాన్న: మీరు ఉన్నావ్ చేరుకోండి, అక్కడ ఆసుపత్రికి వెళ్ళాక నాకు ఫోన్ చేయండి. నేను అక్కడికి మనిషిని పంపిస్తున్నాను.
