ప్లస్ వన్ చదువుతున్న కన్నకూతురిని హత్య చేసిన కేసులో, తల్లికి మరియు ఆమె ప్రియుడికి విధించిన జీవిత ఖైదు శిక్షను కేరళ హైకోర్టు సమర్థించింది.

కేరళలోని నెడుమంగాడ్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న మీరా (16)ను హత్య చేసిన కేసులో.. రెండో నిందితురాలైన తల్లి మంజుషకు, ఆమె ప్రియుడు (మొదటి నిందితుడు) అనీష్‌కు తిరువనంతపురం సెషన్స్ కోర్టు విధించిన శిక్షను జస్టిస్ ఎ.కె. జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్లతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.

ఘటన నేపథ్యం: ఈ దారుణ హత్య 2019 జూన్ 10న జరిగింది. భర్తకు దూరంగా ఉంటున్న మంజుష, తన కూతురు మీరాతో కలిసి నెడుమంగాడ్‌లో ఒక అద్దె ఇంట్లో నివసించేది. అక్కడ పొరుగున నివసించే అనీష్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన మీరా వారి సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

హత్య చేసిన తీరు: తమ సంబంధానికి అడ్డు వస్తోందన్న కోపంతో, నిందితులు ఇద్దరూ కలిసి మీరా గొంతుకు షాల్‌తో బిగించి ఊపిరి ఆడకుండా చేశారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత, అనీష్ తన బైక్‌పై మీరాను ఎక్కించుకుని, తన ఇంటి సమీపంలోని నిరుపయోగంగా ఉన్న బావిలో రాయి కట్టి పడేశాడు.

కేసు బయటపడింది ఇలా: తమ కూతురు, మనవరాలు కొన్ని రోజులుగా కనిపించడం లేదని మంజుష తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే అప్పటికే మంజుష.. తన కూతురు ఎవరితోనో తమిళనాడుకు పారిపోయిందని, ఆమెను వెతకడానికి తాను కూడా అనీష్‌తో కలిసి తమిళనాడు వెళ్తున్నానని తన తల్లిని నమ్మించింది. కానీ వీరిద్దరూ నాగర్‌కోయిల్‌లో అద్దె ఇల్లు తీసుకుని కలిసి ఉండటం గమనించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

ప్రత్యక్ష సాక్షులు లేని ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు, మీరా మృతదేహం నుండి సేకరించిన ఆధారాలు నిందితుల నేరాన్ని నిరూపించడంలో కీలకమయ్యాయి. ఈ కేసులో అనీష్‌పై నమోదైన బాల్య న్యాయ చట్టం (Juvenile Justice Act) కింద విధించిన శిక్షను మాత్రం కోర్టు రద్దు చేసింది.

Posted

in

by

Tags: