ఫ్లైట్ టాయిలెట్ నుండి వింత శబ్దాలు: తలుపు తట్టిన క్రూ సిబ్బంది.. లోపలి దృశ్యం చూసి ఫ్యూజులు అవుట్!

అహ్మదాబాద్: విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ కదలికలపై ఎయిర్ హోస్టెస్‌కు ఒక్కసారిగా అనుమానం వచ్చింది. ఆ ప్రయాణీకుడి ప్రవర్తన, ముఖ కవళికలు సాధారణానికి భిన్నంగా ఉండటంతో ఆమె గమనించడం ప్రారంభించింది. అతను టాయిలెట్‌లోకి వెళ్లిన తర్వాత, ఆమె అక్కడికి వెళ్లగా.. లోపలి నుండి కొన్ని వింత శబ్దాలు వినిపించాయి.

ఈ శబ్దాలు విన్న తర్వాత ఆమె అనుమానం మరింత బలపడింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని విమాన కెప్టెన్‌కు చేరవేసింది. కెప్టెన్ ఆలస్యం చేయకుండా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ భద్రతా సంస్థలు మరియు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు.

కొద్దిసేపటికే విమానం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వడమే ఆలస్యం.. కస్టమ్స్ మరియు భద్రతా అధికారులు విమానంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత విమాన టాయిలెట్ నుండి స్వాధీనం చేసుకున్న వస్తువును చూసి అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. దుబాయ్ నుండి అహ్మదాబాద్ వస్తున్న ఈ విమానంలోని టాయిలెట్‌లో ఏకంగా 2.8 కిలోల బంగారాన్ని దాచి ఉంచారు. ఈ అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.

స్పీకర్ బాక్స్‌లో నల్లటి ప్యాకెట్లు:
లభించిన సమాచారం ప్రకారం.. ఈ ఘటన జూన్ 12న చోటుచేసుకుంది. దుబాయ్ నుండి అహ్మదాబాద్ వచ్చిన విమానంలోని టాయిలెట్‌ను తనిఖీ చేయడానికి అధికారులు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సహాయం కూడా తీసుకున్నారు. క్షుణ్ణంగా సోదా చేస్తున్న క్రమంలో, అధికారుల కళ్ళు విమానం ముందు భాగంలో ఉన్న టాయిలెట్ (Front Lavatory) లోని స్పీకర్ బాక్స్‌పై పడ్డాయి. ఆ స్పీకర్ బాక్స్‌ను జాగ్రత్తగా పరిశీలించగా.. లోపల నల్లటి ప్లాస్టిక్ టేప్‌తో చుట్టబడిన రెండు ప్యాకెట్లు కనిపించాయి.

ఆ ప్యాకెట్లను విప్పి చూడగా అధికారులకు స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్లు లభించాయి. ఈ గోల్డ్ బిస్కెట్లన్నీ 999.0 స్వచ్ఛత (24 క్యారెట్లు) కలిగి ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం బరువు 2,799.3 గ్రాములు (సుమారు 2.8 కిలోలు) గా తేలింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ. 4 కోట్ల 26 లక్షల 89 వేల 325 గా అంచనా వేశారు. బంగారం దాచిన విధానాన్ని బట్టి.. దీనిని భారతదేశంలోకి అక్రమంగా తరలించడానికి (గోల్డ్ స్మగ్లింగ్) ప్రయత్నించినట్లు కస్టమ్స్ విభాగం స్పష్టం చేసింది.

ఎవరూ క్లెయిమ్ చేయని రూ. 4 కోట్ల బంగారం!
కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. సాధారణంగా ప్రయాణికులు లేదా విమాన సిబ్బంది దృష్టి సులభంగా పడని అత్యంత రహస్య ప్రదేశంలో ఈ బంగారాన్ని దాచారు. అయితే, విచారణ సమయంలో విమానంలోని ఏ ప్రయాణీకుడు గానీ, క్రూ సిబ్బంది గానీ ఆ బంగారం తమదేనని ఒప్పుకోలేదు. దీంతో ఎవరూ క్లెయిమ్ చేయని ఈ భారీ బంగారాన్ని కస్టమ్స్ చట్టం 1962 (Customs Act 1962) నిబంధనల ప్రకారం ‘అన్‌క్లెయిమ్డ్’ (Unclaimed – లావారీస్) ఆస్తిగా గుర్తిస్తూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *