బంగారు వేట.. ప్రపంచ దేశాల ‘పక్కా’ ప్లాన్.. కేంద్ర బ్యాంకులు పోటీ పడట వెనుక అసలు కారణం ఏంటి?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకవైపు ఒడిదుడుకులకు లోనవుతుంటే, మరోవైపు ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. అదే – బంగారం కొనడం!

అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు మరియు ‘డాలర్’ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాల కారణంగా, రాబోయే రోజుల్లో బంగారానికి గిరాకీ భారీగా పెరగనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది.

కొత్త దేశాల ఎంట్రీ:

ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న అనేక దేశాలు ఇప్పుడు అకస్మాత్తుగా బంగారం వైపు పరుగులు తీస్తున్నాయి. దీనిపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అధికారి షాకాయ్ ఫాన్ మాట్లాడుతూ, “గత కొన్ని నెలలుగా ఒక ఆసక్తికరమైన మార్పు జరుగుతోంది. చాలా కాలంగా బంగారం కొనని లేదా ఇప్పటివరకు మార్కెట్లోకి రాని కేంద్ర బ్యాంకులు కూడా ఇప్పుడు పోటీపడి మరీ పెట్టుబడులు పెడుతున్నాయి,” అని తెలిపారు. ముఖ్యంగా గ్వాటెమాలా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు ఇటీవల పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశాయి.

ఎందుకీ ఆసక్తి?

  • డాలర్ భయం: అమెరికా డాలర్ పట్టు నుండి బయటపడటానికి (De-dollarization), అనేక దేశాలు తమ నిల్వలలో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి.
  • అస్థిర పరిస్థితులు: ప్రపంచ యుద్ధ భయం, ప్రాంతీయ ఘర్షణల సమయంలో ఆదుకునే ఏకైక ‘సేఫ్ హెవెన్’ (Safe Haven) బంగారమేనని ప్రపంచ దేశాల నమ్మకం.
  • ఆర్థిక రక్షణ: ఇతర కరెన్సీల విలువ పడిపోయినా, బంగారం విలువ ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.

మార్చి 2026 నాటికి అత్యధిక బంగారు నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు:

స్థానందేశంనిల్వలు (టన్నులలో)
1అమెరికా8,133.5
2జర్మనీ3,350.3
3ఇటలీ2,451.8
4ఫ్రాన్స్2,437.0
5రష్యా2,327.0
6చైనా2,306.0
7స్విట్జర్లాండ్1,040.0
8భారతదేశం880.0
9జపాన్846.0
10టర్కీ / నెదర్లాండ్స్614.0

Posted

in

by

Tags: