బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. శుక్రవారం రాత్రి నర్సింగీలో 23 ఏళ్ల చంచల్ భౌమిక్ అనే యువకుడిని అతను పని చేస్తున్న షాపులోనే పెట్టి నిప్పు పెట్టారు.
ఘటన వివరాలు:
చంచల్ ఆ రాత్రి గ్యారేజీలో నిద్రిస్తుండగా, నిందితులు బయట నుండి షట్టర్ వేసి, పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. లోపల నుండి చంచల్ ప్రాణభయంతో కేకలు వేస్తున్నా, నిందితులకు కనికరం కలగలేదు. అతను పూర్తిగా కాలిపోయి ప్రాణాలు విడిచే వరకు వారు అక్కడే వేచి చూసి పారిపోయారు. చంచల్ తన అనారోగ్యంతో ఉన్న తల్లికి మరియు వికలాంగుడైన సోదరుడికి ఏకైక ఆర్థిక ఆధారం.
విద్వేష పూరిత ప్రసంగాలు:
స్థానికుల ప్రకారం చంచల్ చాలా నెమ్మదస్తుడు. ఇది మత విద్వేషంతో చేసిన పక్కా ప్లాన్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో దీపు చంద్ర దాస్, ఖోకాన్ చంద్ర దాస్ వంటి వారిని కూడా ఇలాగే కిరాతకంగా చంపారు.
- రెచ్చగొడుతున్న నేతలు: జమాత్-ఎ-ఇస్లామీ వంటి कट्टरవాద సంస్థల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఈ హింసకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. బర్గునా-2 నియోజకవర్గ అభ్యర్థి అఫ్జల్ హుస్సేన్ మాట్లాడుతూ.. “80 శాతం ముస్లింలు ఉన్న దేశ పార్లమెంటులో ముస్లిమేతరులకు చోటు ఉండకూడదు” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, మధ్యయుగపు శిక్షాస్మృతిని (చేతులు నరకడం వంటివి) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అరటిపండ్ల వివాదంలో హోటల్ యజమాని హత్య:
వారం క్రితం గాజీపూర్‌లో ‘బైశాఖీ స్వీట్ మీట్ అండ్ హోటల్’ యజమాని లిటన్ చంద్ర ఘోష్‌ను కేవలం అరటిపండ్ల విషయంలో జరిగిన వివాదంతో కొట్టి చంపారు. అరటి తోట యజమాని మాసూమ్ మియా తన తోటలో పోయిన అరటి గెలలు లిటన్ హోటల్లో కనిపించాయని గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాసూమ్, అతని తండ్రి స్వపన్ మియా, తల్లి మాజేదా ఖాతున్ కలిసి లిటన్‌ను తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
