బంగ్లాదేశ్ కొత్త డ్రామా మొదలు.. భారత్‌తో అతిపెద్ద ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందా?

ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ‘బాయ్‌కాట్ ఇండియా’ పిలుపులు, అదానీ పవర్ ఒప్పందంపై విచారణలు, భారత్ నుండి ప్రభుత్వ ప్రాజెక్టులను వెనక్కి తీసుకోవడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. భారత్‌తో ఉన్న 25 ఏళ్ల విద్యుత్ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ రద్దు చేయాలని చూస్తోందా? లేక ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆగస్టు 2025లో జరిగిన ప్రజా ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో బంగ్లాదేశ్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. కొత్త ప్రభుత్వం రావడం, ఎన్నికల వాతావరణం ఉండటంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం మొదలైంది. షేక్ హసీనా హయాంలో జరిగిన విద్యుత్, పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల ఒప్పందాలను ఇప్పుడు దేశ వ్యతిరేకమైనవిగా ప్రస్తుత పాలకులు చిత్రీకరిస్తున్నారు.

ధరల వివాదం – అదానీ పవర్ ఒప్పందం: బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ (NRC) ఈ ఒప్పందంపై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ పవర్ నుండి కొంటున్న విద్యుత్ ధర అవసరానికి మించి 50% ఎక్కువగా ఉందని, దీనివల్ల ఏటా కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లుతోందని ఆరోపించింది.

  • జార్ఖండ్‌లోని గొడ్డాలో ఉన్న అదానీ బొగ్గు విద్యుత్ కేంద్రం బంగ్లాదేశ్ మొత్తం విద్యుత్ అవసరాలలో 7% నుండి 10% వరకు సరఫరా చేస్తోంది.
  • ఇతర ప్రైవేట్ కంపెనీల కంటే అదానీ విద్యుత్ యూనిట్‌కు 4 నుండి 5 సెంట్లు ప్రియంగా ఉందని నివేదిక పేర్కొంది.
  • అదానీ కంపెనీ భారత కార్పొరేట్ పన్ను భారాన్ని కూడా టారిఫ్‌లో కలిపిందని, ఇది తమకు భారమని బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆరోపిస్తోంది.

అయితే, అదానీ పవర్ దీనిపై స్పందిస్తూ.. తమకు నివేదిక కాపీ అందలేదని, విచారణలో తమ అభిప్రాయాలను తీసుకోలేదని స్పష్టం చేసింది.


Posted

in

by

Tags: