బడిలో పాఠాలు.. ఇంట్లో పాపకృత్యం! భర్తను గొంతు నులిమి చంపి నాటకమాడిన భార్య.. నిద్రలో మద్యం పోసి టీచర్ ఘాతుకం!

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన పద్మ అనే స్కూల్ టీచర్, గోపి అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా తన భర్త లక్ష్మణ్ నాయక్‌ను దారుణంగా హత్య చేసింది. వీరి సంబంధాన్ని భర్త వ్యతిరేకించడంతో ఆగ్రహం చెందిన పద్మ, తన ప్రియుడు మరియు అతని కుటుంబ సభ్యులతో కలిసి పథకం రచించింది.

గత కొన్ని రోజుల క్రితం, ఇంట్లో నిద్రపోతున్న లక్ష్మణ్ నాయక్ నోట్లో బలవంతంగా మద్యం పోసి, ఆపై గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా.. అతను మితిమీరిన మద్యం తాగి మరణించాడని అందరినీ నమ్మించేలా నాటకమాడారు. అయితే లక్ష్మణ్ నాయక్ మరణంపై అనుమానం ఉందని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల విచారణలో పద్మ తన ప్రియుడు గోపి, అతని తల్లి, చెల్లెలు మరియు సోదరుడితో కలిసి ఈ హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విద్యార్థులకు నీతులు చెప్పాల్సిన టీచరే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా పెను కలకలం రేపింది.


Posted

in

by

Tags: