బలాత్కారం చేసే సమయంలో మీ మనసులో ఏముంటుంది? అని అడిగిన యువతి.. ఆ ఖైదీ చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో ప్రతిరోజూ లైంగిక దాడుల వంటి ఘటనల గురించి వింటూనే ఉన్నాం. ఇళ్లు లేదా రోడ్లు.. ఎక్కడైనా ఎవరూ సురక్షితంగా లేని పరిస్థితి నెలకొంది. తాము చేస్తున్న తప్పు వల్ల సమాజం ఎంతగా నాశనమవుతుందో కూడా తెలియని స్థితిలో కొందరు నేరస్తులు ఉన్నారు. అసలు వీరు ఇలా ఎందుకు చేస్తారు? అనే విషయాన్ని తెలుసుకోవాలని ఒక యువతి ప్రయత్నించింది.

ఖైదీలతో యువతి ఇంటర్వ్యూ: కేవలం 22 ఏళ్ల వయసులో, ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్లి.. అత్యాచార నేరంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఇంటర్వ్యూ చేసింది. ఆ యువతి పేరు మధుమిత పాండే, ప్రస్తుతం ఆమె వయసు 26 ఏళ్లు. మధుమిత గత మూడేళ్లలో వందకు పైగా ఖైదీలను ఇంటర్వ్యూ చేసింది. తన పిహెచ్‌డి (PhD) థీసిస్ కోసం ఆమె ఈ ఇంటర్వ్యూలను నిర్వహించింది.

వారి మనసులో ఏముంటుంది? ఒక ఖైదీ ఒక మహిళను లైంగికంగా వేధించేటప్పుడు లేదా అత్యాచారం చేసేటప్పుడు అతని మనసులో ఏముంటుంది? అనే విషయాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో మధుమిత వారిని కలిసింది.

మధుమిత ఏమంటున్నారు? జైలులో ఉన్న ఈ నేరస్తులకు తాము చేసిన పని ఎంత దారుణమైనదో అనే స్పృహ కూడా లేదని మధుమిత చెబుతున్నారు.

ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ అంశంపై పరిశోధన చేసిన మధుమిత మాట్లాడుతూ, “భారతదేశం నేటికీ ఒక సంప్రదాయవాద దేశంగానే ఉంది. ఇక్కడ స్కూళ్లలో పిల్లలకు లైంగిక విద్యను అందించడం లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో లైంగిక విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటం లేదు. కానీ, మహిళల పట్ల ఉన్న అణచివేత ధోరణిని, కుంఠిత మనస్తత్వాన్ని తొలగించాలంటే లైంగిక విద్య (Sex Education) చాలా అవసరం” అని ఆమె అభిప్రాయపడ్డారు.


Posted

in

by

Tags: