“బాబాయ్‌ని మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిందేనని బెదిరించిన కసాయి భర్త..!” పుట్టింట్లోనే తక్షణ విడాకులు (ట్రిపుల్ తలాక్).. ఇద్దరు పిల్లలతో అల్లాడుతున్న అమాయకపు భార్య.. 3 ఏళ్ల నరకయాతన తర్వాత బయటపడిన నిజం..!!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల తల్లికి ఆమె భర్త చట్టవిరుద్ధంగా ‘తక్షణ విడాకులు’ (ట్రిపుల్ తలాక్) ఇచ్చాడు. అంతేకాకుండా, భార్యను తిరిగి కాపురానికి చేర్చుకోవాలంటే తన బాబాయ్‌ని మళ్లీ పెళ్లి (నికా హలాలా) చేసుకోవాలని శారీరకంగా, మానసికంగా వేధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, స్థానిక పోలీసులు ఆమె భర్త మరియు అతని బాబాయ్‌పై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి లక్సర్ ప్రాంతానికి చెందిన వాజిద్‌తో 2020 జూన్ 20న వివాహం జరిగింది.

పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం తేవాలని, చిన్న చిన్న కారణాలకే వాజిద్ తన భార్యను కొడుతూ వేధించేవాడు. ఆ వేధింపులను భరిస్తూనే ఆమె కాపురం చేస్తుండగా, వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం వాజిద్ తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు.

అక్కడ కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడంతో, అందరి ముందే వాజిద్ తన భార్యకు తక్షణ విడాకులు ఇస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి బంధాన్ని తెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆమెను మళ్లీ భార్యగా స్వీకరించాలంటే తన బాబాయ్ ఇర్షాద్‌ను తాత్కాలిక వివాహం (నికా హలాలా) చేసుకోవాలని బలవంతం చేశాడు.

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భర్త వాజిద్, అతని బాబాయ్ ఇర్షాద్‌లపై కేసు నమోదు చేశామని, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags: