ముజఫర్‌నగర్: సమాజంలో హాస్యాస్పదంగా ‘మరదలు వరుసకు సగం భార్యతో సమానం’ అని అంటుంటారు. కానీ, కొందరు వ్యక్తులు ఈ పవిత్రమైన బంధాన్ని బ్రష్టు పట్టించడానికి కూడా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక బావ-మరదలు సరిగ్గా ఇలాంటి నీచమైన పనికే ఒడిగట్టారు.
బావ-మరదలు మధ్య వివాహేతర సంబంధం (అఫైర్) మొదలైంది. మోహంతో వారిద్దరూ హద్దులన్నీ దాటేశారు. ఈ క్రమంలో మరదలు గర్భవతి అయింది. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో, ఆ బావ తన మరదలికి గుట్టుచూడకుండా గర్భస్రావం (అబార్షన్) చేయించాడు. అయితే, ఆ తర్వాత వారు చేసిన ఒక పెద్ద తప్పు వారిని నేరుగా జైలుకు పంపించింది.
వారిద్దరూ అబార్షన్ చేసిన ఆ పిండాన్ని (భ్రూణాన్ని) పట్టణంలోని ఒక చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ పడి ఉన్న పిండాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న 100కు పైగా సీసీటీవీ (CCTV) కెమెరాలను జల్లెడ పట్టారు. ఆ విజువల్స్‌లో బావ-మరదలి నిర్వాకం స్పష్టంగా కనిపించడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇంటికి తెలియడంతో నిందితుడి భార్య (మరదలికి అక్క) కన్నీరుమున్నీరైంది.. “పోలీసులు గనుక ఈ నిజం చెప్పకపోతే, నాకు జీవితాంతం ఈ విషయం తెలిసేదే కాదు. నా భర్త, నా సొంత చెల్లెలు ఇద్దరూ కలిసి నన్ను, నా కుటుంబాన్ని ఘోరంగా వంచించారు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
100 సీసీటీవీ కెమెరాల తనిఖీ
పోలీస్ లైన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎస్పీ (SSP) సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. జూన్ 24న రూర్కీ చౌకీ చుంగీ సమీపంలోని ఒక చెత్త కుప్పలో నవజాత పిండం లభ్యమైందని తెలిపారు. ఈ ఘటనపై గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్వాలి సిటీ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఉమేష్ రోరియా తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న దాదాపు 100 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
బావ-మరదలిపై చట్టపరమైన చర్యలు
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తర రాంపురి నివాసి ‘అభిషేక్’, అతని మరదలు ‘ప్రియ’లను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్, ప్రియల మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగానే ప్రియ గర్భం దాల్చిందని విచారణలో తేలింది. వీరి సంబంధం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే.. ప్రియకు బలవంతంగా అబార్షన్ చేయించి, ఆ 6 నెలల పిండాన్ని చెత్తకుప్పలో పారేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
