బిఎండబ్ల్యూ, మెర్సిడెస్ కార్లు సగం ధరకే! విదేశీ మద్యం, మందులపై భారీ తగ్గింపు.. యూరోపియన్ వస్తువులతో భారత మార్కెట్‌లో పండుగ వాతావరణం!

భారత్ – యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల 90 శాతానికి పైగా యూరోపియన్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం (Import Duty) పూర్తిగా రద్దు కానుంది లేదా భారీగా తగ్గనుంది. దశాబ్దాల కాలంగా సాగుతున్న చర్చల తర్వాత ఈ చారిత్రాత్మక ఒప్పందం కార్యరూపం దాల్చింది.

లగ్జరీ కార్ల ధరల్లో భారీ కోత: ప్రస్తుతం మెర్సిడెస్, బిఎండబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ లగ్జరీ కార్లపై 100 శాతానికి పైగా దిగుమతి సుంకం ఉంది. కొత్త ఒప్పందం ప్రకారం, 15,000 యూరోల (సుమారు రూ. 16 లక్షలు) కంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై పన్నును తొలుత 40 శాతానికి తగ్గించి, ఆ తర్వాత క్రమంగా 10 శాతానికి తగ్గించనున్నారు. దీనివల్ల లగ్జరీ కార్ల ధరలు లక్షల రూపాయల మేర తగ్గనున్నాయి.

వైద్య ఖర్చులు తగ్గుతాయి: మెడికల్ రంగంలో ఉపయోగించే సర్జికల్ పరికరాలు, డయాగ్నోస్టిక్ ఎక్విప్‌మెంట్ వంటి 90% ఉత్పత్తులపై పన్నును సున్నా శాతానికి తగ్గించనున్నారు. దీనివల్ల శస్త్రచికిత్సలు మరియు రోగనిర్ధారణ పరీక్షల ఖర్చు సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది.

మద్యం మరియు ఇతర వస్తువులు:

  • యూరోపియన్ వైన్‌లపై పన్ను 20-30 శాతానికి తగ్గుతుంది.
  • స్పిరిట్స్ (మద్యం) పై 40%, బీర్‌పై 50% పన్ను తగ్గనుంది.
  • ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి.

భారతీయ ఉత్పత్తులకు యూరోప్‌లో ‘ఫ్రీ ఎంట్రీ’: ప్రతిగా, యూరోపియన్ దేశాలు కూడా 99.5% భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని వచ్చే 7 ఏళ్లలో సున్నా శాతానికి తగ్గిస్తాయి. ముఖ్యంగా మన సీఫుడ్, చర్మ ఉత్పత్తులు, వస్త్రాలు (టెక్స్టైల్స్), రబ్బరు, రత్నాలు మరియు ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగనున్నాయి.


Posted

in

by

Tags: