బ్యాంక్ ఖాతాదారులకు కొత్త రూల్స్.. ₹25,000 పైన లావాదేవీలకు ఛార్జీలు! కీలక మార్పులు అమలు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI, ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ (IMPS) లావాదేవీలపై కొత్త ఛార్జీలను ప్రకటించింది. అయితే, కొన్ని రకాల ఖాతాలకు ఈ ఛార్జీల నుండి మినహాయింపు ఇచ్చింది.

కొత్త IMPS లావాదేవీల ఛార్జీలు (GST అదనం):
లావాదేవీ మొత్తంఆన్‌లైన్ (App/Net Banking) ఛార్జీలుబ్యాంక్ బ్రాంచ్ ద్వారా ఛార్జీలు
₹1,000 వరకుఉచితంఉచితం
₹1,001 నుండి ₹10,000 వరకుఉచితం₹2 + GST
₹10,001 నుండి ₹25,000 వరకుఉచితం₹4 + GST
₹25,001 నుండి ₹1,00,000 వరకు₹2 + GST₹4 + GST
₹1,00,001 నుండి ₹2,00,000 వరకు₹6 + GST₹12 + GST
₹2,00,001 నుండి ₹5,00,000 వరకు₹10 + GST₹20 + GST
ఈ ఖాతాదారులకు మినహాయింపు (చార్జీలు ఉండవు):

కొన్ని ప్రత్యేక శ్రేణి ఖాతాదారులకు ఈ కొత్త IMPS ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు లభిస్తుంది:

  • ప్రభుత్వ ఉద్యోగులు: రక్షణ (Defence), సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ జీతాల ఖాతాలు, రైల్వే మరియు పోలీస్ శాలరీ ప్యాకేజీ ఖాతాలు.
  • పెన్షనర్లు: శౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతాలు.
  • ఇతర ఖాతాలు: కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ, స్టార్టప్ శాలరీ ప్యాకేజీ మరియు ‘SBI రిశ్తే’ (Family Savings Account) ఖాతాదారులు.

Posted

in

by

Tags: