బెంగళూరు: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో కేరళకు చెందిన ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు దారుణంగా మరణించిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కబానవర స్టేషన్ సమీపంలో జరిగింది.
రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని విద్యార్థి జస్టిన్ జోసెఫ్ (21) మరియు విద్యార్థిని స్టెరిన్ ఎల్జా సజి (19) అనే ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న చిక్కబానవర పోలీస్ స్టేషన్ పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.
కేరళలోని పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరూ బెంగళూరులోని సప్తగిరి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సెమిస్టర్ చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం చిక్కబానవర స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా సూపర్ ఫాస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఫలితంగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
