బ్లింకిట్ డెలివరీ భాగస్వామి అసభ్య ప్రవర్తన: ‘మీరు వైబ్రేటర్ ఎందుకు వాడుతున్నారు…’: “నన్ను వాడుకో…” అంటూ మహిళకు వేధింపులు, వైరల్‌గా మారిన పోస్ట్!

బ్లింకిట్ (Blinkit) యాప్ ద్వారా డెలివరీ జరిగిన సమయంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఒక మహిళ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది మహిళల భద్రత, ప్రైవసీపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. తాను ఆర్డర్ చేసిన ఒక ‘సెక్షువల్ వెల్నెస్’ ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు మహిళ లింక్డ్‌ఇన్ (LinkedIn) పోస్ట్‌లో ఆరోపించారు.

ఏం జరిగింది? మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తాను ఏళ్ల తరబడి ఈ యాప్‌ను వాడుతున్నానని, ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ వ్యక్తి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కుని ఇంటికి వచ్చాడు. తలుపు తీయగానే, డెలివరీ వ్యక్తి ఆమెను చూస్తున్న తీరుకు బాధితురాలు అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే పార్శిల్ తీసుకుని తలుపు మూసేశారు. అయితే, పార్శిల్ ప్యాకెట్ సరిగ్గా సీల్ చేయబడలేదని ఆమె గమనించారు. ఆ వెంటనే, అదే డెలివరీ వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది.

అసభ్యకర వ్యాఖ్యలు: ఫోన్ చేసిన వ్యక్తి “మేమ్, ఇది ఏమిటి?” అని అడగ్గా, ఆమె “ఏదైతేనేం, నీకెందుకు?” అని బదులిచ్చారు. అంతటితో ఆగకుండా, ఆ వ్యక్తి “ఇవన్నీ ఎందుకు మేమ్, నన్ను వాడుకో… చాలా మజా ఇస్తాను” అంటూ అత్యంత అసభ్యంగా మాట్లాడాడు. ఈ మాటలకు ఆమె నిశ్చేష్టురాలయ్యారు. తన ఇంటి చిరునామా తెలిసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం భద్రతా పరంగా ఆమెను భయాందోళనకు గురిచేసింది. ఆమె ఫిర్యాదు చేస్తానని హెచ్చరించగానే, వాడు వెంటనే క్షమాపణలు కోరాడు. కానీ, అది తన భయాన్ని పోగొట్టడానికి సరిపోదని ఆమె అన్నారు.

ప్రశ్నల వర్షం: బ్లింకిట్ కస్టమర్ కేర్ ప్రతినిధులు ఫిర్యాదును నమోదు చేసుకున్నప్పటికీ, సదరు మహిళ పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు:

  1. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలేమిటి?
  2. అత్యంత సున్నితమైన ఆర్డర్‌ను కనీసం సీల్ చేయకుండా ఎందుకు పంపారు?
  3. డెలివరీ భాగస్వామిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు?

తన పోస్ట్‌కు ఆధారంగా, సరిగ్గా సీల్ చేయని పార్శిల్ ఫోటోను, కస్టమర్ సపోర్ట్‌తో జరిగిన చాట్ స్క్రీన్‌షాట్‌లను ఆమె జత చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తమ సొంత ఇంట్లో కూడా సురక్షితంగా లేరా? అని పలువురు ఆవేదన చెందుతున్నారు.


Posted

in

by

Tags: