భర్త, అత్త కలిసి తీర్చిన అప్పు. ఆటలు ఆడుకోవడానికి పదేపదే అప్పు చేసిన భార్య.. ఏడేళ్ల కొడుకును దుఃఖంలో వదిలేసిన తల్లి తీసుకున్న వింత నిర్ణయం. ఒక ఘోర విషాదం.!!

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని నెలమంగల ప్రాంతంలో, ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై లక్షల రూపాయలు కోల్పోయి, అప్పుల బాధ తాళలేక రంజిత (28) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

కలబురగికి చెందిన రంజిత, ఆమె భర్త అరుణ్ గత ఐదేళ్లుగా నెలమంగలలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. రంజిత అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేది.

గడిచిన ఏడాది కాలంగా ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన రంజిత, అందులో భారీగా డబ్బు పోగొట్టుకుంది. దీనివల్ల దాదాపు ₹15 లక్షల అప్పులు కాగా, భర్త మరియు ఆమె తల్లి కలిసి ఆ అప్పును తీర్చారు. అయినప్పటికీ, ఆమె మళ్లీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ మరిన్ని అప్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో భర్త పని నిమిత్తం సొంతూరు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న 7 ఏళ్ల కుమారుడిని వదిలేసి రంజిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags: