భర్త కళ్లముందే పరుగెత్తుకెళ్లి ప్రియుడిని కౌగిలించుకున్న భార్య! కోర్టు గుమ్మం ముందే సాగిన హైడ్రామా.. ఎంత లాగినా వదలని వైనం.. సినిమాను మించిన సీన్.. తలతిరిగేలా చేసే వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలిభిత్ ప్రాంతంలోని కోర్టు ప్రాంగణం ముఖద్వారం వద్ద అనూహ్యంగా తీవ్ర కలకలం రేగింది.

ఓ మహిళ కేసు విచారణ నిమిత్తం తన భర్తతో కలిసి కోర్టుకు వచ్చింది.

ఆ సమయంలో కోర్టు ప్రవేశ ద్వారం వద్ద నిల్చుని ఉన్న ఒక యువకుడిని చూడగానే, ఆ మహిళ ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లి అందరి ముందే అతడిని గట్టిగా కౌగిలించుకుంది. అతడు మరెవరో కాదు, సదరు మహిళ ప్రియుడు.

కనురెప్పపాటు కాలంలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో అక్కడే ఉన్న భర్తతో పాటు మిగతా జనం బిత్తరపోయారు. వెంటనే భర్త తరఫు బంధువులు ఆ మహిళను లాగి, ప్రియుడి నుంచి వేరు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ మహిళ మాత్రం ప్రియుడిని విడిచిపెట్టేందుకు ఏమాత్రం ఒప్పుకోకుండా పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి.

అక్కడ ఉన్నవారంతా ఈ సంఘటనను విస్తుపోయి చూడటమే కాకుండా తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయడం మొదలుపెట్టారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, చివరకు ఆ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడి వెంటే అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కోర్టు ప్రాంగణం వద్ద జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: