భారీ యుద్ధం.. రక్తపాతం! 2026 కోసం నోస్ట్రడామస్ షాకింగ్ అంచనాలు

2026లో ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతోందో నోస్ట్రడామస్ రాసిన అంచనాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ప్రవక్త 465 ఏళ్ల క్రితమే తన ‘Les Propheties’ అనే పుస్తకంలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను పద్యాల రూపంలో రాసి ఉంచారు. గతంలో ఆయన చెప్పిన సెప్టెంబర్ 11 దాడులు, కోవిడ్-19 వంటివి నిజమవ్వడంతో, 2026 గురించి ఆయన ఏం చెప్పారో అన్న ఆసక్తి పెరిగింది.

2026లో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు:

1. ప్రముఖ వ్యక్తిపై దాడి: “పగటిపూట ఉరుము లాంటి దెబ్బతో ఒక గొప్ప వ్యక్తి కూలిపోతాడు” అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ‘ఉరుము’ అంటే ఆకాశం నుండి పడే పిడుగు అని కాకుండా, తుపాకీ గుండు లేదా ఏదైనా ఆయుధ దాడి అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ‘గొప్ప వ్యక్తి’ ఎవరో స్పష్టత లేదు కానీ, రాజకీయాల్లో లేదా ఇతర రంగాల్లో అపారమైన ప్రభావం ఉన్న వ్యక్తి కావొచ్చని అంచనా.

2. కొత్త వ్యాధుల ముప్పు: “టస్కనీ (Tuscany) లో మళ్ళీ వ్యాధి ప్రబలుతుంది” అని ఆయన రాశారు. ఆసియా వెలుపల కోవిడ్-19 మొదట గుర్తించిన ప్రాంతాల్లో ఇటలీలోని టస్కనీ ఒకటి. అక్కడ మరోసారి కొత్త వైరస్ లేదా అంటువ్యాధి వచ్చే అవకాశం ఉందని దీని అర్థం.

3. స్విట్జర్లాండ్‌లో యుద్ధం: “టిసినో (Ticino) ప్రాంతం రక్తంతో నిండిపోతుంది” అని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని ఈ ప్రాంతం ఎప్పుడూ తటస్థంగా ఉంటూ యుద్ధాలకు దూరంగా ఉంటుంది. కానీ 2026లో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటుందని ఆయన హెచ్చరించారు.

4. డ్రోన్ల వినియోగం?: “తేనెటీగల సమూహం లాంటిది ఒకటి అకస్మాత్తుగా ఎగురుతూ వస్తుంది.. అవి ఎక్కడి నుండి వచ్చాయో ఎవరికీ తెలియదు” అని రాశారు. ఆధునిక కాలంలో యుద్ధాల్లో వాడుతున్న డ్రోన్ల (Drones) గురించే ఆయన అప్పుడే ‘తేనెటీగలు’ అని ప్రస్తావించి ఉండవచ్చని భావిస్తున్నారు.

5. సముద్ర యుద్ధం: “ఏడు నౌకల చుట్టూ యుద్ధ నౌకలు బయలుదేరుతాయి; ఒక భయంకరమైన సముద్ర యుద్ధం జరుగుతుంది” అని ఆయన 7వ భాగంలోని 26వ పద్యంలో రాశారు. ఇది అమెరికా-వెనిజులా మధ్య లేదా చైనా-తైవాన్ మధ్య జరిగే ప్రాణాంతక యుద్ధం కావొచ్చని చర్చ జరుగుతోంది.

6. ద్రోహాల వల్ల పతనం: “శత్రువుల కంటే ఘోరమైన వెన్నుపోట్ల వల్ల కొన్ని దేశాలు కూలిపోతాయి” అని ఆయన హెచ్చరించారు. ఇంగ్లాండ్ వంటి దేశాలకు 2026 అంత శుభప్రదంగా ఉండదని, పాతకాలపు ‘ప్లేగ్’ వంటి వ్యాధులు మళ్ళీ తలెత్తవచ్చని ఆయన అంచనా వేశారు.


Posted

in

by

Tags: