ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ సరిహద్దుల్లోనే కాకుండా, దేశం లోపల కూడా మరో యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ఈ యుద్ధం ఇమ్రాన్ ఖాన్ మరియు ఆయన మద్దతుదారుల మధ్య జరుగుతోంది. ఇటీవల ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరియు సైనిక చీఫ్ మునీర్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ జైలు నుండే పాకిస్థాన్‌లో అంతర్యుద్ధానికి (Civil War) నాంది పలికారు. చీకటి గది నుండి తన మద్దతుదారుడు, మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి ఒక రహస్య సందేశాన్ని పంపారు.
బుష్రా బీబీ పట్ల అనుచిత ప్రవర్తన తోషాఖానా-2 కేసు విచారణ సందర్భంగా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ మరియు బుష్రా బీబీలకు 17 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ సోదరీమణుల కథనం ప్రకారం.. జైలు లోపల పోలీసులు ఇమ్రాన్ మరియు బుష్రా బీబీ పట్ల దురుసుగా ప్రవర్తించారని, వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లడానికి ప్రయత్నించారని ఆరోపించారు. బారిస్టర్ సఫ్దర్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను ‘సాలిటరీ కన్ఫైన్మెంట్’ (ఏకాంత కారాగారం)లో ఉంచి మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, తనకు శిక్ష పడిన విషయం కూడా ఇమ్రాన్‌కు సరిగ్గా తెలియనివ్వడం లేదని పేర్కొన్నారు.
జైలు గది నుండి ఇమ్రాన్ సందేశం జైలు లోపల నుండి ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులకు మరియు దేశ ప్రజలకు ఎమోషనల్ సందేశాన్ని పంపారు. “మాతృభూమి కోసం నేను ప్రాణత్యాగం (షహాదత్) చేయడానికైనా సిద్ధం, కానీ ఈ అరాచకాలకు తలవంచను” అని ప్రకటించారు. షాహిద్ అఫ్రిదికి నేరుగా సందేశం పంపుతూ.. ప్రభుత్వంతో ‘తేల్చుకోవడానికి’ సిద్ధంగా ఉండాలని కోరారు. “రోడ్లపై ఆందోళనల కోసం సిద్ధంగా ఉండండి” అని అఫ్రిదికి పంపిన సందేశంలో పేర్కొన్నారు. దీనిని బట్టి తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
“లెక్కలు రోడ్లపైనే తేలుతాయి” ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ తీవ్రంగా స్పందిస్తూ.. శిక్షలు విధించి ఇమ్రాన్‌ను జైలులో బంధించగలమని ప్రభుత్వం అనుకుంటే అది భ్రమే అవుతుందని అన్నారు. పాకిస్థాన్ ప్రజలు ఇక మౌనంగా ఉండరని, ఈ అన్యాయానికి రోడ్లపైనే లెక్కలు తేలుతాయని హెచ్చరించారు.
