మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటన రాత్రి వేళ జరిగినట్లు తెలుస్తోంది. తన భార్య వేరొక వ్యక్తితో ఉండటం చూసిన భర్త, తీవ్ర ఆగ్రహంతో అక్కడే గొడవకు దిగాడు. దీంతో నడిరోడ్డుపై కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనంతరం రోడ్డుపై ఉన్న స్కూటీని అతను ఎత్తి కిందపడేసి ధ్వంసం చేశాడు. భర్త చేసిన ఈ పని చూసి చుట్టుపక్కల ఉన్నవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడున్న కొందరు ఈ ఘటనను తమ సెల్‌ఫోన్లలో వీడియా తీశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల వల్లే ఈ గొడవ జరిగినట్లు చెబుతుండగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై స్కూటీని ధ్వంసం చేసిన అంశంపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అంతేకాకుండా, ఘటన సమయంలో అక్కడ ఉన్నవారిని, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు.
అర్థరాత్రి వేళ నడిరోడ్డుపై జరిగిన ఈ గొడవతో ఆ ప్రాంతంలో కాసేపు అలజడి నెలకొంది. ఆవేశంలో భర్త స్కూటీని ఎత్తిపడేసి పగలగొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ తర్వాతే తెలియరానున్నాయి. ఇరు వర్గాల నుంచి వాంగ్మూలాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply