భార్యను 120 మంది పురుషులకు విక్రయించిన 62 ఏళ్ల వ్యక్తి.. 3 ఏళ్ల పాటు ఆ మహిళకు నరకయాతన!

స్వీడన్‌లో తన భార్యను బలవంతంగా సుమారు 120 మంది పురుషులతో వ్యభిచార కూపంలోకి దించిన 62 ఏళ్ల వ్యక్తిపై ఆ దేశ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.

‘హెల్స్ ఏంజెల్స్’ గ్రూపు మాజీ సభ్యుడైన నిందితుడు, తన భార్యకు ఉన్న డ్రగ్స్ అలవాటును ఆసరాగా చేసుకుని, ఆమెను బెదిరిస్తూ, శారీరక హింసకు గురిచేస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2022 నుండి 2025 వరకు జరిగిన ఈ ఘటనలో, ఇంటర్నెట్ ప్రకటనల ద్వారా కస్టమర్లను రప్పించి అతను డబ్బు సంపాదించాడు.

ఈ దారుణం ఫ్రాన్స్‌లో సంచలనం సృష్టించిన ‘గిసెల్ పెలికాట్’ కేసుతో పోల్చబడుతోంది. బాధితురాలు కొన్ని హద్దులు విధించుకున్నప్పటికీ, భర్త వాటిని అతిక్రమించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఐడా అన్నర్‌స్టెడ్ తెలిపారు.

ఈ కేసులో లైంగిక సేవలు పొందిన 26 మంది పురుషులపై కూడా కేసులు నమోదయ్యాయి. దీనిని ‘స్వీడన్ పెలికాట్ కేసు’గా పిలుస్తున్నారు. ఆ దేశ లింగ సమానత్వ శాఖ మంత్రి దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 13న ప్రారంభం కానుంది.


Posted

in

by

Tags: