“భార్యపై అనుమానంతో కెమెరా పెడితే… ఇలాంటి ట్విస్టా?” లాయర్‌కు ఎదురైన షాకింగ్ నిజం… వెలుగులోకి దిగ్భ్రాంతికర విషయం..!!

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో నివసిస్తున్న ఒక లాయర్, తన భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెకు తెలియకుండా ఇంట్లోని లైట్‌లో ఒక చిన్న రహస్య కెమెరాను (Miniature Hidden Camera) అమర్చాడు.

అయితే, కెమెరా పెట్టిన కేవలం రెండు రోజుల్లోనే ఆయన ఇంట్లో ఉన్న విలువైన నగలు చోరీకి గురయ్యాయి. నగలు కనిపించకపోవడంతో ఆ భార్య, ” అయ్యో, నా నగలన్నీ పోయాయే! నా నగలన్నీ పోయాయే!” అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నాటకమాడింది.

దీంతో అనుమానం వచ్చిన భర్త, తన గదిలో అమర్చిన రహస్య కెమెరా రికార్డింగ్‌లను తనిఖీ చేసి చూశాడు. ఆ సమయంలో, ఇంట్లోని నగల దొంగతనం చేసింది మరెవరో కాదు, గుండెలు బాదుకుని నాటకమాడిన తన సొంత భార్యే అనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.

వెంటనే ఆ లాయర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, కెమెరా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కెమెరా ఆధారాల ఆధారంగా ఆ మహిళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అక్కడ జరిపిన సుదీర్ఘ విచారణలో, “నేనే నగలన్నీ దొంగిలించి నా ప్రియుడికి ఇచ్చాను; అతనికి అత్యవసరంగా డబ్బు అవసరమైంది” అని ఆ మహిళ నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ మహిళ ప్రియుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

భార్యపై నిఘా ఉంచడానికి పెట్టిన కెమెరా, చివరికి దొంగతనాన్ని బయటపెట్టి భర్తకు ఆధారాలను అందించిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *