“భార్య ఇంట్లో లేదు, నీపై నాకు ఎప్పటి నుంచో కన్ను ఉంది”.. అత్తపై అఘాయిత్యం చేసి చంపేసిన అల్లుడు.. ఇంటికి వచ్చిన కుమార్తెకు దిగ్భ్రాంతికర దృశ్యం!

తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలో అల్లుడు తన అత్తపైనే లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

కల్వకుర్తి ప్రాంతానికి చెందిన నరసింహ (40) అనే వ్యక్తికి, మల్లిక అనే మహిళ చిన్న కుమార్తెతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసే నరసింహ మధ్యానికి బానిస కావడంతో పనులకు వెళ్లకుండా, మద్యం మత్తులో భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేక భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన నరసింహ తరచూ అత్తగారి ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు.

ఫిబ్రవరి 8వ తేదీన మల్లిక కుమార్తె మరియు మనవళ్లు ఒక వివాహ వేడుక కోసం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో మల్లిక ఒక్కరే ఉండటాన్ని గమనించిన నరసింహ, మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. ఒంటరిగా ఉన్న అత్తను అడ్డగించి, ఆమెపై తనకు చాలా కాలంగా వ్యామోహం ఉందని చెబుతూ బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వయసు మళ్లిన మహిళ అని కూడా చూడకుండా, ఆమె కేకలు వేసినా వినిపించుకోకుండా అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసి అక్కడి నుండి పారిపోయాడు.

శుభకార్యం ముగించుకుని ఇంటికి వచ్చిన కుమార్తె, తన తల్లి రక్తపు మడుగులో శవమై ఉండటం చూసి షాక్‌కు గురై పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న కల్వకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నరసింహను పట్టుకుని విచారించగా, మద్యం మత్తులో అత్తపై అత్యాచారం చేసి చంపినట్లు అతను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


Posted

in

by

Tags: