దక్షిణాసియా దేశమైన వియత్నాంలోని హా జియాంగ్ పర్వత ప్రాంతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఓ వింత సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణ మార్కెట్లలో వస్తువులు కొనడం, అమ్మడం జరుగుతుంది. కానీ ఈ మార్కెట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. తమ పాత ప్రేమికులను, గతంలో కలిసినా వివాహం చేసుకోలేకపోయిన మాజీ ప్రియులను కలుసుకుని మాట్లాడుకోవడం కోసమే ఈ ‘ప్రేమ మార్కెట్’ నిర్వహిస్తారు.
మలయ ప్రాంతాల్లో నివసించే గిరిజన సమాజాలు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు కథనం పేర్కొంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన ప్రేమకథ కూడా ఉందట.
వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఓ ప్రేమజంట వివాహం చేసుకోలేక విడిపోవాల్సి వచ్చిందని చెబుతారు. అయితే ఏడాదికి ఒక్కసారి ఇదే ప్రదేశంలో కలుసుకుని మాట్లాడుకోవాలని వారు నిర్ణయించుకున్నారట.
ఆ ప్రేమకథ జ్ఞాపకార్థంగానే ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చిందని స్థానిక కథనాలు చెబుతున్నాయి.
ఈ ‘లవ్ మార్కెట్’లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వివాహమైన పురుషులు, మహిళలు తమ జీవిత భాగస్వాముల అభ్యంతరం లేకుండా తమ మాజీ ప్రేమికులను కలుసుకుని పాత జ్ఞాపకాలను పంచుకోవడానికి అనుమతి ఉంటుంది.
ప్రస్తుత జీవిత భాగస్వామికి అసూయ కలగకుండా, గత సంబంధాలను ఒక జ్ఞాపకంగా మాత్రమే చూసే ఈ సంప్రదాయం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆధునిక సమాజంలో అనుమానాలు, అసూయ కారణంగా ఎన్నో సంబంధాల్లో సమస్యలు తలెత్తుతున్న సమయంలో.. ఈ పర్వత ప్రాంత గిరిజనుల విస్తృత మనస్తత్వం, ప్రేమకు వారు ఇచ్చే ప్రత్యేక గౌరవం ఆసక్తిని కలిగిస్తోంది.
రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి పర్వత మార్గాల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చే గిరిజన ప్రజలతో ఈ ప్రాంతం సందడిగా మారుతుంది. కాఫీ, సంస్కృతి, పాత ప్రేమ జ్ఞాపకాలతో కలిసిపోయిన ఈ వింత ‘ప్రేమ మార్కెట్’కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారుతున్నాయి.

Leave a Reply