“భార్య ముందు మాస్ చూపించాలనుకుని ఇలా దొరికిపోయారా!”. పోలీస్ స్టేషన్‌లో చిక్కిన నకిలీ ఎస్పీ. సినిమా స్టైల్‌లో రక్తికట్టిన నాటకం..!!!”

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఉన్న ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో, ఒక మహిళకు చెందిన షోరూమ్‌లో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దీంతో తన భార్య ముందు తక్కువైపోకూడదని, వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చేయించడం కోసం ఆ మహిళ భర్త ఒక విపరీతమైన, సినిమా తరహా నిర్ణయం తీసుకున్నాడు.

ఇందులో భాగంగా, DLF సెక్టర్-29 పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ అధికారిక ఫోన్ నంబర్‌కు కాల్ చేసిన ఆ వ్యక్తి, తాను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చందన్ సింగ్‌ను అని చెబుతూ అదరగొట్టేలా మాట్లాడాడు. అంతేకాకుండా, మెగా మాల్‌లోని షోరూమ్‌కు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని పోలీస్ అధికారిని బెదిరించే ధోరణిలో ఆదేశించడంతో పాటు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పి లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే అవతలి వైపు మాట్లాడిన పోలీస్ అధికారి సమయస్ఫూర్తితో కూడిన చర్యల వల్ల, ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మాటల్లోని అనుమానాస్పద ధోరణి వల్ల ఆ అబద్ధం వెంటనే బయటపడింది. వెంటనే మోటార్ బైక్‌పై దూసుకెళ్లిన ప్రత్యేక బృందం పోలీసులు అక్కడ నిర్వహించిన మెరుపు తనిఖీల్లో, నకిలీ ఎస్పీగా హల్‌చల్ చేసిన వ్యక్తి ఢిల్లీకి చెందిన కరణ్ కుమార్ సాహుజా అని తేలడంతో అతడిని అరెస్టు చేశారు.


Posted

in

by

Tags: