బీహార్ రాష్ట్రంలోని ‘గుర్జీ మోడ్’ ప్రాంతంలో బుధవారం ఉదయం రూ. 7 లక్షల విలువైన బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుడు ‘పంకజ్ కుమార్’ తన ఇంటికి సమీపంలో ఉన్న కౌన్సిలర్ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయన మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు.
ఈ దొంగతనం ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడి వెనుక ఒక యువతి కూర్చుని ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఇద్దరూ హెల్మెట్లు ధరించడంతో వారి ముఖాలను తక్షణమే గుర్తించడం సాధ్యపడలేదు.
ఉదయం వేళ రోడ్లపై రాకపోకలు తక్కువగా ఉండటంతో, బాధితుడు పంకజ్ కుమార్ వారిని వెంటాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ బైక్పై ఉన్న ఇద్దరూ వేగంగా పారిపోయారు.
ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలు మరియు బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply