ఈ రోజుల్లో ప్రజల్లో ఒత్తిడి, అలసట వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని పోగొట్టుకోవడానికి చాలామంది బీర్ (Beer) తాగుతుంటారు. చల్లని బీర్ తాగడం వల్ల నిమిషాల్లో అలసట తగ్గుతుందని చాలామంది నమ్మకం. అయితే బీర్ తాగే సమయం కూడా చాలా ముఖ్యమని మీకు తెలుసా? దీనివల్ల కలిగే ప్రభావాలు మీరు ఏ సమయంలో తాగుతారనే దానిపై ఆధారపడి ఉంటాయి.
బీర్ తాగడానికి సరైన సమయం ఏది? ఉదయం పూట తాగాలా లేక రాత్రి పూటా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పూట బీర్ తాగడం సరైనదేనా?
ఉదయం పూట బీర్ తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఉదయం సమయంలో శరీరం ‘డిటాక్స్’ (విషతుల్యాలను బయటకు పంపే) మోడ్‌లో ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే అది రక్తంలోకి చాలా త్వరగా కలిసిపోతుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు (Blood Sugar levels) పడిపోవచ్చు. ఫలితంగా నీరసం, తల తిరగడం లేదా విపరీతమైన అలసటగా అనిపించవచ్చు. అంతేకాకుండా, ఈ అలవాటు మిమ్మల్ని త్వరగా మద్యానికి బానిసలుగా మార్చే ప్రమాదం ఉంది.
రాత్రి పూట బీర్ తాగడం మంచిదేనా?
ఉదయంతో పోలిస్తే రాత్రి పూట బీర్ తాగడం కొంత మేలు. ఎందుకంటే రోజంతా శరీరం యాక్టివ్‌గా ఉండి, సాయంత్రానికి జీర్ణవ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే, రాత్రి పూట కూడా పరిమితికి లోబడే తాగాలి. పడుకునే ముందు బీర్ తాగడం వల్ల పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది, దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా మరుసటి రోజు ‘హ్యాంగోవర్’ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి పూట కూడా పరిమితంగా తీసుకోవడం ముఖ్యం.
అసలు సరైన సమయం ఏది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం, బీర్ లేదా మరే ఇతర మద్యం తాగడానికి ఉదయం పూట ఏమాత్రం మంచి సమయం కాదు. ప్రతిరోజూ బీర్ తాగడం ఆరోగ్యానికి హానికరం. వారానికి ఒకసారి మాత్రమే అది కూడా పరిమితంగా తీసుకోవాలి. రాత్రి పూట సరైన ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే తాగడం సురక్షితం. అన్నింటికంటే ముఖ్యంగా, మద్యం పరిమితంగానే ఉండాలి. దీన్ని దైనందిన అలవాటుగా మార్చుకోకండి.
