“మన ₹1 ఉంటే విదేశాల్లో ఇంత విలువా..? ఈ 10 దేశాల్లో భారత రూపాయి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!”

విదేశీ ప్రయాణం అనగానే భారతీయులకు మొదటగా గుర్తొచ్చేది బడ్జెట్ మరియు భారీ ఖర్చులే. ముఖ్యంగా భారత రూపాయిని డాలర్, యూరో వంటి అంతర్జాతీయ కరెన్సీలుగా మార్పిడి చేసుకునేటప్పుడు.. మన చేతిలో ఉన్న డబ్బుల విలువ తక్కువగా అనిపిస్తుంటుంది.

కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో భారత రూపాయిని మార్చుకుంటే, భారీ మొత్తంలో ఆయా దేశాల కరెన్సీ లభిస్తుంది. ఆ విధంగా పర్యాటకులకు భారత రూపాయి విలువ అనుకూలంగా ఉండే టాప్-10 దేశాల జాబితా విడుదలైంది.

ఈ జాబితాలో వియత్నాం అగ్రస్థానంలో ఉంది. అక్కడ భారత ₹1 సుమారు 276 వియత్నామీస్ డాంగ్‌లకు సమానమని పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియాలో ₹1కి సుమారు 186 రుపయ్యాలు, నేపాల్‌లో సుమారు 1.6 నేపాలీ రూపాయలు, శ్రీలంకలో సుమారు 3.47 శ్రీలంక రూపాయలు లభిస్తాయి. బాలి, హనోయ్, పొఖారా, క్యాండీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఈ దేశాల్లోనే ఉన్నాయి.

ఆ తర్వాత జాబితాలో కంబోడియా, మయన్మార్, పరాగ్వే దేశాలు చోటు దక్కించుకున్నాయి. కంబోడియాలో ₹1కి సుమారు 49 రీల్స్, మయన్మార్‌లో సుమారు 25 క్యాట్లు, పరాగ్వేలో సుమారు 89 గ్వారానీలు లభిస్తాయి. ముఖ్యంగా అంగ్‌కోర్ వాట్, బగాన్ ఆలయాలు, పరాగ్వే రాజధాని అసూన్సియోన్ వంటి ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

జాబితాలోని చివరి మూడు స్థానాల్లో హంగేరీ, టాంజానియా, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. హంగేరీలో ₹1కి సుమారు 4.3 ఫోరింట్లు, టాంజానియాలో సుమారు 30 షిల్లింగ్‌లు, ఉజ్బెకిస్తాన్‌లో సుమారు 145 సోమ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, కేవలం ఒక దేశ కరెన్సీ మారకం విలువ ఎక్కువగా ఉన్నంత మాత్రాన అక్కడ ప్రయాణం పూర్తిగా చవకైపోతుందని భావించలేం. ఆహారం, బస (హోటల్ స్టే), రవాణా, పర్యాటక ప్రవేశ రుసుములు వంటి స్థానిక వ్యయాలను కూడా లెక్కలోకి తీసుకుని పర్యటన బడ్జెట్‌ను ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది.

దేశంభారత కరెన్సీ మారకం విలువ (సుమారు)కరెన్సీ పేరు
వియత్నాం₹1 ≈ 276డాంగ్ (VND)
ఈండోనేషియా₹1 ≈ 186రుపయ్యా (IDR)
ఉజ్బెకిస్తాన్₹1 ≈ 145సోమ్ (UZS)
పరాగ్వే₹1 ≈ 89గ్వారానీ (PYG)
కంబోడియా₹1 ≈ 49రీల్ (KHR)
టాంజానియా₹1 ≈ 30షిల్లింగ్ (TZS)
మయన్మార్₹1 ≈ 25క్యాట్ (MMK)
హంగేరీ₹1 ≈ 4.3ఫోరింట్ (HUF)
శ్రీలంక₹1 ≈ 3.47శ్రీలంక రూపాయి (LKR)
నేపాల్₹1 ≈ 1.6నేపాలీ రూపాయి (NPR)

Posted

in

by

Tags: