సాధారణంగా సింహం అంటేనే గాంభీర్యం, వేట మరియు పరాక్రమానికి గుర్తుగా భావిస్తాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే, “ఇది నిజంగా సింహమేనా?” అని అడగక మానరు.
ఈ వీడియోలో, ఒక సింహం దాహంతో అడవిలో నిలిచి ఉన్న నీటిని తాగడానికి వస్తుంది. అయితే, అదే నీటిలో ఒక వ్యక్తి తల నుండి కాలి వరకు బురద పూసుకుని, సగం శరీరం నీటిలో మునిగి ఉండేలా మాటు వేసి ఉన్నాడు. సింహం నీటి దగ్గరకు వచ్చిన మరుక్షణమే, ఆ వ్యక్తి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అది చూసిన సింహం ఒక్క నిమిషం షాక్కు గురైంది.
అస్సలు ఊహించని ఈ ‘దెయ్యం లాంటి ఆకారాన్ని’ చూసి, ఆ అడవి రాజు భయంతో ఒక మేక పిల్లలా అక్కడి నుండి ప్రాణ భయంతో పరుగులు తీశాడు.
“సింహానికి కూడా భయం ఉంటుందని ఇప్పుడే తెలిసింది” అని నెటిజన్లు ఒకవైపు ఆటపట్టిస్తుంటే, “ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కదా” అని ఆ సింహమే అనుకుని ఉంటుంది అంటూ చాలా మంది ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
