“మాకే ఎదురు ప్రశ్నలు వేస్తావా?.” ఢిల్లీలో న్యూసెన్స్‌ను నిలదీసిన సంగీత కళాకారుడు.. కొట్టి చంపిన దుండగులు.. గుండెల్ని పిండేసే ఘటన.!

ఢిల్లీలోని కిలోక్రి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున, తన ఇంటి బయట పెద్దగా అరుస్తూ మద్యం సేవిస్తున్న డెలివరీ బాయ్స్, దాబా సిబ్బందిని నిలదీసినందుకు మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు సి. విక్రమ్ సింగ్ (54) వారి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడి ఘటన అనంతరం, మరణించిన కళాకారుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వస్థలమైన మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు తరలించారు. ఆయన అంత్యక్రియల్లో బంధుమిత్రులు, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర ఆవేదనతో పాల్గొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సంగీత కళాకారుడిపై దాడి చేసి ఆయన మృతికి కారణమైన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.


Posted

in

by

Tags: