“మా మొగుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు ..! మందులో సైనైడ్. 12 అడుగుల గోతిలో పూడ్చిపెట్టి 2 ఏళ్లుగా నాటకమాడిన భార్య. కళ్లు మూసేసిన అక్రమ సంబంధం మోజు. చిక్కింది ఎలా..?”

గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో గత రెండు సంవత్సరాలకు పైగా కనిపించకుండా పోయిన జిగ్నేష్ మావాడియా అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు దిగ్భ్రాంతికరమైన సమాచారాన్ని వెల్లడించారు.

జిగ్నేష్ భార్య, ఆమె ప్రియుడు కలిసి అతడి మందులో సైనైడ్ విషం కలిపి చంపేశారు. ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీలో 12 అడుగుల లోతున గోతి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు విచారణలో తెలిసింది.

హత్య చేసిన విషయాన్ని దాచడానికి జిగ్నేష్ భార్య కుటుంబ సభ్యుల వద్ద పెద్ద నాటకమే ఆడింది. అతడు ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని నమ్మించింది. అతడు పనిచేసే కంపెనీలో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతి లేదని చెప్పడంతో, గత రెండేళ్లుగా కుటుంబ సభ్యులు జిగ్నేష్‌ను సంప్రదించలేకపోయారు. ఆస్ట్రేలియా శాశ్వత పౌరసత్వం లభించిన తర్వాత అతడు ఊరికి తిరిగి వస్తాడని చెప్పి మోసం చేయడంతో, ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు.

అయితే, జిగ్నేష్ బంధువు ఒకరు ఆస్ట్రేలియా వెళ్లాలని నిశ్చయించుకుని అతడి చిరునామా అడిగినప్పుడే ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. భార్య సరిగ్గా సమాధానం చెప్పకుండా దాటవేయడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత తీవ్ర విచారణ జరపగా, గత 2024 మే నెలలోనే తాము ఈ హత్య చేసినట్లు భార్య, ఆమె ప్రియుడు నిలేష్ ఒప్పుకున్నారు.

ప్రస్తుతం ఈ కేసులో క్లూస్ టీమ్ నిపుణులు, అధికారుల సమక్షంలో, ఆ ఫ్యాక్టరీ ప్రాంగణంలో తవ్వి మృతదేహపు మిగిలిన భాగాలను వెలికితీసే పని తీవ్రంగా జరుగుతోంది. తన సొంత భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసి, ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడని చెప్పి రెండు సంవత్సరాలు నాటకమాడిన భార్య చర్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *