చట్టపరమైన వయస్సు రాగానే ప్రతి ఒక్కరూ కారు స్టీరింగ్ పట్టుకోవాలని ఆశపడతారు. దీని కోసం మొదట లెర్నర్ లైసెన్స్, ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని RTO నుండి పర్మనెంట్ లైసెన్స్ పొందుతారు.
అయితే, ఒక ఉత్తమ డ్రైవర్‌గా మారడానికి చాలా సమయం పడుతుంది. మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు మన భద్రతతో పాటు, కారులో ఉన్నవారు మరియు రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల భద్రత కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా కారు నడపడం నేర్చుకుని, పర్ఫెక్ట్ డ్రైవర్ కావాలనుకుంటే, ఈ 5 చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
- సరైన డ్రైవింగ్ పొజిషన్
మీ సీటును అడ్జస్ట్ చేసుకునేటప్పుడు వెన్నుముక సీటుకు ఆని ఉండేలా చూసుకోండి. మోకాళ్లు కొద్దిగా వంగి ఉండాలి మరియు పాదాలు బ్రేక్, యాక్సిలరేటర్‌కు సులభంగా అందాలి. స్టీరింగ్ వీల్‌ను “9 గంటల 15 నిమిషాల” పొజిషన్లో పట్టుకోవడం వల్ల కారుపై నియంత్రణ బాగుంటుంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో త్వరగా స్పందించవచ్చు. - డిఫెన్సివ్ డ్రైవింగ్ (అప్రమత్తంగా నడపడం)
రోడ్డుపై ఇతర డ్రైవర్లు ఎప్పుడైనా తప్పు చేయవచ్చు అనే ఆలోచనతో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముందు వెళ్లే వాహనానికి కనీసం 3-4 సెకన్ల దూరం పాటించండి. రియర్ వ్యూ మిర్రర్ మరియు సైడ్ మిర్రర్లను ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. ఓవర్ టేక్ చేసే ముందు ‘బ్లైండ్ స్పాట్స్’ తనిఖీ చేయడం మర్చిపోవద్దు. - ట్రాఫిక్ నిబంధనల పాటించడం
రోడ్డు ఖాళీగా ఉందని ఎప్పుడూ స్పీడ్ లిమిట్ దాటకండి. మీ లేన్‌లోనే ప్రయాణించండి. మలుపులు తిరిగేటప్పుడు లేదా లేన్ మారేటప్పుడు ఇండికేటర్లు తప్పనిసరిగా వాడండి. సీట్ బెల్ట్ ధరించడం మీ ప్రాణాలను కాపాడుతుందని గుర్తుంచుకోండి. రోడ్డుపై ఇతరులతో గొడవలకు (Road Rage) దిగకండి. - ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోండి
డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ అస్సలు వాడకండి. కాల్స్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా మీ ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. డ్రైవింగ్ చేస్తూ తినడం, తాగడం లేదా పక్కవారిలో అతిగా మాట్లాడటం ప్రమాదకరం. మీకు అలసటగా లేదా నిద్రగా అనిపిస్తే వెంటనే సురక్షితమైన చోట కారు ఆపి విశ్రాంతి తీసుకోండి. - వాహన నిర్వహణ మరియు సాధన (Practice)
ప్రతి వారం టైర్లలో గాలి, బ్రేకులు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ మరియు లైట్లను తనిఖీ చేయండి. వాహనం కండిషన్లో లేకపోతే బ్రేక్ ఫెయిల్ అవ్వడం లేదా టైర్లు పేలడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. రద్దీగా ఉండే ప్రాంతాలు, వర్షం, రాత్రి సమయాల్లో మరియు హైవేలపై డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
