మీ స్కూల్‌నే క్లోజ్ చేసేస్తా..! “టీచర్‌నే బెదిరించిన బుడతడు”.. చదువుకోమనడం అంత తప్పా? నెట్టింట వైరల్ వీడియో!

తరగతి గదిలో పాఠం చదువుకోమని చెప్పిన టీచర్‌కు, ఒక చిన్నారి తన ముద్దుముద్దు మాటలతో ఇచ్చిన వార్నింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావాగ్నంలా వ్యాపిస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక టీచర్ బాబు దగ్గరకు వెళ్లి, “తమ్ముడూ, పద్ధతిగా చదువుకో… పుస్తకం తీసి చదువు” అని ప్రేమగా చెబుతారు. అది విన్న వెంటనే ఆ చిన్నారి ఏడవడం మొదలుపెడతాడు. ఏడుస్తూనే అకస్మాత్తుగా టీచర్‌ వైపు చూసి, “పోండి… ఎక్కువగా మాట్లాడకండి… లేకపోతే మీ స్కూల్‌నే పడగొట్టి నేలమట్టం చేసేస్తా” అంటూ బెదిరింపులకు దిగాడు.

చిన్నారి ఇచ్చిన ఈ వార్నింగ్‌కు టీచర్ ఒక్క క్షణం అవాక్కయ్యారు. తర్వాత ఆ బాబు అమాయకత్వాన్ని చూసి టీచర్ మరియు పక్కనే ఉన్న విద్యార్థులు నవ్వడం మొదలుపెట్టారు. ఎక్స్ (X) వేదికగా షేర్ చేయబడిన ఈ వీడియో, లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ పిల్లాడు భవిష్యత్తులో పెద్ద డాన్ అయ్యేలా ఉన్నాడు!”, “ఇలాంటి అమాయకపు గొడవలను రోజూ చూడొచ్చు” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఆ బుడతడి ‘క్యూట్ రౌడిజం’ ప్రస్తుతం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.


Posted

in

by

Tags: