ముస్లిం యువతితో ప్రేమ.. 19 ఏళ్ల యువకుడి పెళ్లి ఆశ.. కానీ ఆమె పెట్టిన ఒక్క షరతుతో జీవితమే అంతం!

సాంగ్లీలోని ఖణాభాగ్‌కు చెందిన 19 ఏళ్ల దుర్వాంక్ షేవాలే అనే యువకుడు పుణెలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావడంతో గారాబంగా పెరిగాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ యువకుడి జీవితంలో ఒక యువతి ప్రవేశించింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ యువతి పెళ్లి కోసం మతం మారాలనే షరతు పెట్టడంతో దుర్వాంక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తీవ్ర మానసిక వేదనలో ఉన్న దుర్వాంక్ చివరకు తన స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

మతం మార్చుకోవాలనే షరతు: దుర్వాంక్ ఆత్మహత్యకు ముందు తన మొబైల్‌లోని ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ను గమనించిన తల్లిదండ్రులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ యువతి పెళ్లి చేసుకోవాలంటే మతం మారాల్సిందేనని షరతు విధించినట్లు చాట్‌లో ఆధారాలు లభించాయి. ఈ విషయం వల్లే తన కొడుకు గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

పోలీసుల విచారణ: దుర్వాంక్ తల్లి ఫిర్యాదు మేరకు, సంబంధిత యువతి మరియు ఆమెకు సహకరించిన మరో యువకుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు (Abetment to suicide) కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాల కోసం ఇద్దరు నిందితుల సోషల్ మీడియా డేటాను సేకరిస్తున్నామని, సైబర్ పోలీసుల నుండి ఆ సమాచారం అందగానే విచారణ వేగవంతం చేస్తామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సుగావ్కర్ తెలిపారు.


Posted

in

by

Tags: