” మెడికల్ కిట్ కూడా లేదు!”. రైల్లో ప్రసవ వేదనతో తల్లడిల్లిన మహిళ.. కేవలం కత్తితో ప్రసవం చేసిన నర్సు… ఉత్కంఠభరిత సంఘటన..!!!

నాగ్‌పూర్ నుండి ముంబై వైపు వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైల్లో, ప్రసవ వేదనతో కొట్టుమిట్టాడిన 36 ఏళ్ల మహిళకు ఎలాంటి వైద్య పరికరాలు లేకుండానే ఒక నర్సు రైట్లోనే విజయవంతంగా ప్రసవం చేసిన ఘటన నెరవేరింది.

రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కి ఫోన్ చేయగా, తర్వాతి స్టేషన్‌లోనే సహాయం అందుతుందని చెప్పినప్పటికీ, ప్రసవ సమయం దగ్గర పడటంతో రైల్లో ప్రయాణిస్తున్న బాంబే హాస్పిటల్ నర్సు మీనూ బైసారే వెంటనే రంగంలోకి దిగారు.

గ్లౌజులు , కత్తెర వంటి ప్రాథమిక వైద్య పరికరాలు కూడా లేని ఆ క్లిష్ట పరిస్థితిలో, తోటి ప్రయాణికుల సహాయంతో బెడ్‌షీట్లను తెరలుగా కట్టి, శానిటైజర్ తో శుభ్రం చేసిన ఒక కత్తిని ఉపయోగించి సురక్షితంగా కాన్పు చేసి బిడ్డను బయటకు తీశారు.

తల్లీ, పసికందు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత, రైలు చాలీస్‌గావ్ స్టేషన్‌కు చేరుకోగానే వారిని ఆసుపత్రికి తరలించారు.

నర్సు మీనూ బైసారే చూపిన ధైర్యసాహసాలు, మానవతా దృక్పథానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రైళ్లలో అత్యవసర వైద్య పెట్టెలలో ప్రసవానికి సంబంధించిన కనీస ప్రాథమిక పరికరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.


Posted

in

by

Tags: