ప్రతి జంటకు వారి సుహాగ్రాత్రి (మొదటి రాత్రి) ఎంతో ప్రత్యేకమైనది. సాధారణంగా ఆ మరుసటి రోజు భార్యాభర్తలు ఉత్సాహంగా ఉండాలి. కానీ, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుహాగ్రాత్రి రోజు వరుడు చేసిన ఒక పని వల్ల, మరుసటి రోజు ఉదయాన్నే వధువు కన్నీరుమున్నీరైంది.
అంతేకాకుండా, ఆమె వెంటనే తన పుట్టింటి వారికి ఫోన్ చేసి, పోలీసులను కూడా పిలిపించింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? తెలుసుకుందాం.
ఈ ఘటన మంగల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. సోమవారం (మే 9) యువతీ యువకులకు వివాహం జరిగింది. వధువు మంగల్పూర్కు చెందినది కాగా, వరుడు సమీపంలోని గ్రామానికి చెందిన వ్యక్తి. పెళ్లి తంతు అంతా సజావుగా సాగింది. సాయంత్రం వధువును అత్తవారింటికి సాగనంపారు. బంధువులు, చుట్టుపక్కల వారు వధువును చూసేందుకు వచ్చారు. రాత్రి సమయం కావడంతో, స్నేహితులు వరుడిని ఆటపట్టించి, వధూవరులను గదిలోకి పంపారు.
మరుసటి రోజు ఉదయం వధువు కన్నీటితో తన బాధను పుట్టింటి వారికి చెప్పింది. కుమార్తె గోడు విని తల్లిదండ్రులు వెంటనే అత్తవారింటికి చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, వరుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అక్కడ ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి పోలీసులు ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చారు. కానీ, ఆ రాత్రి అసలు ఏం జరిగిందనేదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
వధువు చెప్పిన నిజం: అసలు విషయం ఏమిటంటే, ఆ రాత్రి వధువు గదిలోకి వెళ్లి నిద్రపోయింది. చాలా సేపటి వరకు వరుడు గదిలోకి రాలేదు. ఆమె గాఢ నిద్రలో ఉండగా, కాసేపటికి భర్త గదిలోకి వచ్చాడు. తనను లేపడానికి ప్రయత్నించాడని, కానీ నిద్రలో ఉండటం వల్ల తాను లేవలేకపోయానని వధువు తెలిపింది. దీనితో కోపంతో ఊగిపోయిన భర్త, తన బెల్టుతో వధువును విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె అరుపులు విని అత్తమామలు గదిలోకి వచ్చి, వరుడి నుండి వధువును కాపాడారు.
ఈ విషయంపై మంగల్పూర్ ఎస్.కె. మిశ్ర మాట్లాడుతూ, వధువు తరపున ఫిర్యాదు అందడంతో వరుడిని అదుపులోకి తీసుకున్నామని, అయితే ఆ తర్వాత ఇరు పక్షాల వారు పరస్పర అంగీకారంతో రాజీ పడటంతో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని కోరారని తెలిపారు.
