ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని ఒక గెస్ట్ హౌస్ గదిలో గత 20 రోజులుగా బస చేస్తున్న ఒక యువ జంట విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ గది నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికేట్)తో పాటు ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదే సమయంలో, మృతుల్లోని నర్గీస్ అనే యువతిపై హర్దోయ్ పోలీస్ స్టేషన్లో గతంలోనే ఒక కిడ్నాప్ కేసు నమోదై ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఈ కేసులో సరికొత్త మలుపు తిరిగింది. ఈ మిస్టరీ మరణాలపై పోలీసులు అన్ని కోణాల్లో లోతైన విచారణ జరుపుతున్నారు.
