మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్న వేళ, చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌పై సైనిక చర్యలో అమెరికాకు సహకరించని దేశాలు ఇకపై తమ చమురు అవసరాలను తామే చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ పెట్టిన రెండు ఆప్షన్లు:
- అమెరికా నుండి కొనండి: మా వద్ద తగినంత చమురు ఉంది, మా దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోండి.
- హోర్ముజ్ జలసంధిలో పోరాడండి: ధైర్యం ఉంటే ఇరాన్ దిగ్బంధించిన హోర్ముజ్ జలసంధికి వెళ్లి యుద్ధం చేసి చమురు తెచ్చుకోండి.
బ్రిటన్ (UK) పై ఆగ్రహం: ముఖ్యంగా బ్రిటన్ వంటి దేశాలను ఉద్దేశిస్తూ.. ఇరాన్‌ను దెబ్బతీసే విషయంలో సహకరించని వారు ఇప్పుడు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నారని, అమెరికా ఎప్పుడూ అందరినీ కాపాడటానికి సిద్ధంగా ఉండదని ట్రంప్ తేల్చి చెప్పారు. “మీరు సొంతంగా పోరాడటం నేర్చుకోవాలి” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధి సంక్షోభం: ఫిబ్రవరి 28న అమెరికా పరిమిత సైనిక చర్య ప్రారంభించిన తర్వాత, ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీనివల్ల బ్యారల్ ధర 100 డాలర్లకు పైగా చేరింది. ఏప్రిల్ 6 లోపు ఇరాన్‌తో ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ భావిస్తున్నారు. లేనిపక్షంలో ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు, ఖార్గ్ ద్వీపం వంటి చమురు ఎగుమతి కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
ఇరాన్ మొండితనం – గల్ఫ్ దేశాల ఆందోళన: మరోవైపు ఇరాన్ తగ్గడం లేదు. హోర్ముజ్ గుండా వెళ్లే నౌకలపై తమ దేశ కరెన్సీలో ‘టోల్’ వసూలు చేస్తామని ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై కఠిన ఆంక్షలు విధించింది. ఒకవేళ అమెరికా సైన్యం ఇరాన్ గడ్డపై అడుగుపెడితే గల్ఫ్ అరబ్ దేశాలపై భూతల యుద్ధం చేస్తామని, సముద్రంలో మైన్లు (Mines) విత్తుతామని హెచ్ఛరించింది.
