యుద్ధవిమానాలు, సబ్‌మెరైన్లతో ఇరాన్ దిశగా అమెరికా నౌకాదళం! 7500 మంది సైనికులతో భారీ మోహరింపు

దక్షిణ చైనా సముద్రం నుండి మధ్యప్రాచ్యం (Middle East) వైపు అమెరికా తన అతిపెద్ద నౌకాదళాన్ని తరలిస్తోంది. ఇరాన్‌లో అంతర్గత అల్లర్లు, నిరసనకారులపై అణచివేత నేపథ్యంలో యుద్ధ భయంతో అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఇప్పటికే తన ఆకాశ సీమను (Airspace) మూసివేసింది. ఈ తరుణంలో సుమారు 7500 మంది నౌకాదళ సైనికులతో కూడిన ‘అమెరికన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్’ ఇరాన్ దిశగా బయలుదేరింది.

సైనిక శక్తి మరియు వ్యూహం: పెంటగాన్ ఆదేశాల మేరకు ఈ స్ట్రైక్ గ్రూప్‌ను యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందులో ఒక భారీ విమానవాహక నౌక (Aircraft Carrier), ఒక క్రూజర్, రెండు డిస్ట్రాయర్లు, సబ్‌మెరైన్లు మరియు ఇతర సహాయక నౌకలు ఉన్నాయి. ఇవి ఒక దేశం యొక్క మొత్తం నౌకాదళాన్ని ఒంటరిగా ఎదుర్కోగల శక్తిని కలిగి ఉంటాయి. ఇరాన్ గగనతలాన్ని మూసివేసినందున, అమెరికా సముద్ర మార్గం ద్వారా దాడి చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ హెచ్చరిక: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. “ఇరాన్‌లో నిరసనకారులకు మరణశిక్షలు అమలు చేస్తే, అమెరికా కఠిన చర్యలు తీసుకుంటుంది. భయంకరమైన పరిణామాలు ఉంటాయి” అని ఆయన హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా తాము దేనికైనా సిద్ధమని ప్రతి సవాల్ విసిరింది.


Posted

in

by

Tags: