రక్తసిక్తమైన పెళ్లి మండపం: ఆసుపత్రి పాలైన వరుడు, పెళ్లి కోసం వేడుకున్న వధువు!

కొల్లేగల్: పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వధువు నయన ప్రియుడు, వరుడు రవీష్‌పై కత్తితో దాడి చేయడంతో పెళ్లి ఆగిపోయింది. తీవ్రంగా గాయపడిన వరుడిని ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే: కర్ణాటక చామరాజనగర జిల్లా కొల్లేగల్‌లో ఒక సినీ ఫక్కీలో ఈ దారుణం జరిగింది. పెళ్లి ముహూర్తానికి ముందు వరుడు రవీష్ సిద్ధమవుతుండగా, వధువు ప్రియుడు ఒక్కసారిగా వచ్చి అతడిని చంపాలనే ఉద్దేశంతో కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న రవీష్‌ను వెంటనే కొల్లేగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడి వెనుక వధువు నయన ప్రియుడి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి ఆగిపోయినప్పటికీ, నయన ఆసుపత్రికి వెళ్లి రవీష్‌ను తనను పెళ్లి చేసుకోవాలని బతిమిలాడింది. అయితే, ప్రాణాపాయం నుండి తప్పించుకున్న రవీష్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. “పెళ్లి సమయంలోనే నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో నా ప్రాణాలకు గ్యారెంటీ ఏమిటి? అభద్రతతో నేను బతకలేను” అని రవీష్ స్పష్టం చేశాడు.


Posted

in

by

Tags: