వినోద పార్కులు, జాతరల్లో ఏర్పాటు చేసే రాట్నం క్యాబిన్లు కుటుంబాలతో కలిసి ప్రజలు సరదాగా గడపడానికి ఏర్పాటు చేస్తుంటారు. అయితే.. ఓ రాట్నం మూసివేసిన క్యాబిన్‌లో ఓ యువకుడు, యువతితో కలిసి హద్దులు మీరి ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ క్యాబిన్‌లో వారు చేసిన అసభ్యకరమైన చర్యలను ఎవరో వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వీడియోకు లక్షలాది వ్యూస్ రావడం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఈ విషయం ఆ యువకుడు పనిచేస్తున్న సంస్థలోని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు కథనం పేర్కొంది.
దీంతో సంస్థ అధికారి వెంటనే ఆ యువకుడిని ఫోన్‌లో సంప్రదించి.. అతని ప్రవర్తన సంస్థ ప్రతిష్టకు, పేరుకు భంగం కలిగించిందని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. అనంతరం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు కథనం చెబుతోంది.
ఒక్క వీడియో కారణంగా పరువు పోయి, ఉద్యోగం కూడా కోల్పోయిన ఈ యువకుడి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
“బహిరంగ ప్రదేశాల్లో హద్దులు, మర్యాదలు పాటించకుండా ప్రవర్తిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన.. బహిరంగ ప్రదేశాల్లో బాధ్యతగా, ఇతరులను గౌరవిస్తూ ప్రవర్తించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
అయితే, వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన పూర్తి నేపథ్యం, ఘటన ఎక్కడ జరిగింది, యువకుడిపై నిజంగానే ఉద్యోగ పరమైన చర్యలు తీసుకున్నారా అనే వివరాలు స్వతంత్రంగా నిర్ధారించబడలేదు.

Leave a Reply