“రిస్క్ తీసుకోకండి బాస్…!” ఒకే ఒక్క కాటు. అంతే సంగతులు.. అడుగడుగునా ఒక విషసర్పం.. మనుషులకే అనుమతి లేని అత్యంత ప్రమాదకరమైన దీవి.. గుండెల్ని పరుగులు పెట్టించే భయంకరమైన నేపథ్యం..!!

బ్రెజిల్‌లోని సావో పాలో తీరంలో ఉన్న ఈ దీవిలోని అరుదైన జీవరాశులను సంరక్షించడం ప్రధాన ఉద్దేశం కావడంతో, దీనిని ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించింది.

అంతేకాకుండా, వలస వచ్చే ఎన్నో అరుదైన పక్షి జాతులకు కూడా ఈ దీవి ఒక ముఖ్యమైన ఆశ్రయంగా నిలుస్తోంది.

ఈ దీవికి ‘క్విమాడా గ్రాండే’ (Queimada Grande) అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పురాతన కాలంలో ఇక్కడికి వచ్చే మత్స్యకారులు, స్థానికులు పాములను పారద్రోలడం కోసం ఈ దీవిలోని దట్టమైన అడవులకు నిప్పు పెట్టేవారు. ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి కాలిపోయేవి. పోర్చుగీసు భాషలో ‘క్విమాడా గ్రాండే’ అంటే ‘భారీగా కాలిపోయిన ప్రదేశం’ అని అర్థం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *