రూ.2 కోట్ల కోసం తనే అమ్ముడుపోయిన 24 ఏళ్ల యువతి! ఆశగా పెళ్లాడిన 74 ఏళ్ల వృద్ధుడు.. పెళ్లయిన తర్వాత తెలిసిన షాకింగ్ నిజం.. ఇక జైలే.. డబ్బు కోసం ఇలానా..?

ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఉన్న పసితాన్ ప్రాంతంలో గత 2025 అక్టోబర్‌లో జరిగిన ఒక విచిత్రమైన వివాహం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.

74 ఏళ్ల ధర్మాన్ అనే వృద్ధుడు, 24 ఏళ్ల షేలా అరికా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న 50 ఏళ్ల వయసు వ్యత్యాసం కంటే కూడా.. పెళ్లి సమయంలో వరుడు ధర్మాన్ వధువుకు గిఫ్ట్ కింద 3 బిలియన్ ఇండోనేషియన్ రుపియా (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.80 నుండి 2 కోట్ల రూపాయలు) విలువైన భారీ చెక్కును అందరి ముందూ బహుమతిగా ఇవ్వడమే ప్రపంచాన్ని అంతా ముక్కున వేలేసుకునేలా చేసింది.

లగ్జరీ పెళ్లి – వైరల్ ఫోటోలు:
వీరి ఆడంబరమైన వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటిని చూసిన పలువురు నెటిజన్లు వీరిది “నిజమైన ప్రేమ” అంటూ అప్పట్లో కొనియాడారు. కానీ, ఆ సంతోషం కొన్ని రోజుల్లోనే తలకిందులైంది. పెళ్లయిన కొద్దిరోజులకే.. పెళ్లి ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లకు డబ్బులు ఇవ్వకుండా ఈ జంట అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీనిని అనుసరించి, ఆ వృద్ధుడు ఇచ్చిన 2 కోట్ల రూపాయల చెక్ నకిలీదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది.

పోలీసుల దర్యాప్తులో తేలిన షాకింగ్ నిజాలు:
ప్రారంభంలో ఈ వార్తలను వధువు కుటుంబ సభ్యులు ఖండించినప్పటికీ.. రంగంలోకి దిగిన పోలీసుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వరుడు ధర్మాన్ ఒక పక్కా కేటుగాడని, అతను ఇప్పటికే 2022లో ఒక పెద్ద మోసం కేసులో చిక్కి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చాడని తెలిసింది.

ఆ తర్వాత, పెళ్లి కోసం అతను ఇచ్చిన 3 బిలియన్ రుపియా చెక్ పూర్తిగా నకిలీది (ఫేక్) అని నిర్ధారించిన పోలీసులు అతడిని జూబ్లీగా అరెస్ట్ చేశారు. సదరు యువతిని నమ్మించి, ఆశ చూపించి పెళ్లి చేసుకోవడానికే తాను ఈ నకిలీ చెక్కు డ్రామా ఆడినట్లు ధర్మాన్ పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకున్నాడు.

భర్తకు మద్దతుగా నిలిచిన యువతి:
ఈ ఘోర ఉదంతం, మోసపూరిత చర్యకు గాను అతనికి గరిష్టంగా 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఇక్కడే ఒక విచిత్రమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. 24 ఏళ్ల అతని యువ భార్య షేలా.. “నేను నా భర్తను ప్రేమిస్తున్నాను, అతనిపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు” అని చెబుతూ ఇప్పటికీ ఆ వృద్ధుడికే మద్దతుగా నిలబడటం గమనార్హం. ప్రస్తుతం ఈ నకిలీ చెక్ మరియు వయసు వ్యత్యాసంతో కూడిన వివాహం.. ప్రపంచవ్యాప్తంగా డబ్బు కోసం జరిగే పెళ్లిళ్లపై ఒక పెద్ద చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: