రూ. 2 లక్షల పెట్టుబడి చాలు.! నెలకు రూ. 30,000 వరకు సంపాదించవచ్చు.! స్వయం ఉపాధి ఆలోచనలు

మనలో చాలా మందికి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరిక ఉంటుంది. కానీ, నష్టం వస్తుందేమో అన్న భయం ఆపుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఇచ్చే ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో పేపర్ ప్లేట్ల వినియోగం బాగా పెరిగింది. శుభకార్యాలు, ఫంక్షన్లు, టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్‌కు బదులుగా వీటినే వాడుతున్నారు. ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి కాబట్టి వీటికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.

పెట్టుబడి మరియు వనరులు: ఈ వ్యాపారానికి పెద్ద స్థలం అవసరం లేదు, ఒక చిన్న గది సరిపోతుంది. పేపర్ ప్లేట్ తయారీ యంత్రం, ముడి సరుకులు, విద్యుత్ కనెక్షన్ ఉంటే చాలు. యంత్రం ధర సుమారు రూ. 1.25 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

తయారీ విధానం: పేపర్ రోల్స్‌ను యంత్రంలో అమర్చితే, ఆటోమేటిక్‌గా ప్లేట్లు తయారవుతాయి. ఒక గంటలో 1000 నుండి 2000 ప్లేట్ల వరకు తయారు చేయవచ్చు. అంటే రోజుకు వేల సంఖ్యలో ప్లేట్లు ఉత్పత్తి చేయవచ్చు.

లాభాల లెక్క: ఒక ప్లేట్ తయారీ ఖర్చు సుమారు రూ. 0.40 నుండి రూ. 0.80 వరకు ఉంటుంది. దీనిని మార్కెట్లో రూ. 1 నుండి రూ. 2 వరకు అమ్మవచ్చు. ఒక్కో ప్లేట్‌పై రూ. 0.50 లాభం వచ్చినా, నెలకు సుమారు రూ. 30,000 వరకు సంపాదించవచ్చు. సరైన మార్కెటింగ్ ద్వారా ఈ లాభాన్ని ఇంకా పెంచుకోవచ్చు.


Posted

in

by

Tags: