రూ. 36,000 కోట్ల భారీ ఎక్స్‌ప్రెస్‌వే.. కానీ ఈ వానకే తట్టుకోలేకపోయింది! అకస్మాత్తుగా పడ్డ భారీ గుంత.. కంబళి కప్పి కన్నాన్ని దాచిపెట్టిన దౌర్భాగ్యం.. వైరల్ అవుతున్న వీడియో..!!!

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంగా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు పలు అడుగుల మేర కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది.

బషీర్‌గంజ్ గ్రామం సమీపంలో, ఎక్స్‌ప్రెస్‌వే 423.6వ కిలోమీటర్ వద్ద ఈ భారీ గుంత పడినట్లు సమాచారం. దీంతో మీరట్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. కాగా, రహదారి రంగులోనే ఉన్న ఓ గుడ్డ లేదా కంబళి లాంటి పదార్థంతో ఆ గుంతను కప్పి ఉంచినట్లు చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఎడతెరిపి లేని వర్షాల వల్ల రహదారి ఒక్కసారిగా కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు ఆ మార్గంలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. అయితే, ఆ గుంతను కనిపించకుండా దాచేందుకే రోడ్డు రంగు వస్త్రాన్ని ఉపయోగించారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఆ వస్త్రాన్ని అసలు ఏ కారణంతో అక్కడ పరిచారు అనే విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *