తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన ఓ వివాహిత వద్ద, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షేక్ నబీ అనే వ్యక్తి హోటల్ వ్యాపారం ప్రారంభించేందుకు రూ.43 లక్షల డబ్బు తీసుకున్నాడు.
డబ్బు ఇచ్చిన ఆ మహిళతో మాయమాటలు చెప్పి ఓ మద్యం పార్టీకి పిలిచిన షేక్ నబీ, కూల్డ్రింక్/మద్యంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయాక నగ్నంగా అశ్లీల వీడియోలు తీశాడు.
తాను తీసిన ఆ అశ్లీల వీడియోలను చూపించి బెదిరిస్తూ, గత 3 ఏళ్లుగా ఆ మహిళపై నిరంతరం లైంగిక దాడికి పాల్పడుతున్న దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడి వేధింపులు, బెదిరింపులు తాళలేక బాధిత మహిళ ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నమ్మి డబ్బు ఇచ్చిన మహిళనే నగ్న వీడియోలు తీసి బెదిరిస్తూ, 3 ఏళ్లుగా ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఈ ఘటన హైదరాబాద్లో తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని సృష్టించింది.

Leave a Reply