“రెండుసార్లు విషపు ఇంజెక్షన్ ఇచ్చినా పోని ప్రాణాలు!” – మరణశిక్ష అమలు సమయంలో గురక తీస్తూ నిద్రపోయిన మహిళా ఖైదీ. అమెరికాలో విస్తుపోయే ఘటన..!!!

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో మరణశిక్ష పడిన ఒక మహిళా ఖైదీకి రెండుసార్లు విషపు ఇంజెక్షన్లు ఇచ్చినప్పటికీ, ఆమె చనిపోకుండా హాయిగా గురక పెట్టి నిద్రపోయిన అత్యంత వింత ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

1995లో నాక్స్‌విల్లేలోని ఓ శిక్షణా కేంద్రంలో తోటి విద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను కత్తి, రాయితో దారుణంగా హత్య చేసిన కేసులో 50 ఏళ్ల క్రిస్టా గెయిల్ పైక్ (Christa Gail Pike)కు కోర్టు మరణశిక్ష విధించింది. గత 200 ఏళ్ల టెన్నెస్సీ చరిత్రలో మరణశిక్షకు గురవుతున్న తొలి మహిళ ఈమె కావడంతో ఈ శిక్ష అమలుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బుధవారం రాత్రి ఆమెను స్ట్రెచర్‌కు కట్టేసి, అత్యంత శక్తివంతమైన ‘పెంటోబార్బిటాల్’ (Pentobarbital) అనే విషపు మందును రెండు డోసుల పాటు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. అయితే, విషపు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె మెలకువగానే ఉండి, “నా చేతికి ఇలాగే అనిపిస్తుందా?” అని అధికారులను అడిగింది. అంతేకాకుండా, రెండవ డోసు ఇచ్చిన తర్వాత ఏకంగా పెద్దగా గురక పెట్టి నిద్రపోవడం ప్రారంభించింది.

ఆమె చనిపోతుందని జైలు అధికారులు ఉత్కంఠగా చూస్తుండగా.. ఆ విషాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రాణాలతో ఉండి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో అధికారులు ఏమి చేయాలో పాలుపోక నిర్ఘాంతపోయారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి తీవ్ర చికిత్స విభాగంలో (ICU) చేర్పించారు.

గతంలో నరాలు దొరక్క మరణశిక్షలు వాయిదా పడిన ఘటనలు జరిగాయి కానీ, రెండుసార్లు విషపు ఇంజెక్షన్ ఇచ్చినా ఖైదీ ప్రాణాలతో బయటపడటం ప్రపంచ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఘటన అని మరణశిక్షల నిపుణులు వివరిస్తున్నారు. విఫలమైన ఈ మరణశిక్ష అమలుపై విచారణకు ఆదేశించగా, పైక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *